వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశ్మీర్ నుండి ఢిల్లీకి తెలుగు విద్యార్థులు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జమ్మూ కాశ్మీర్ వరదల్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను క్షేమంగా స్వస్థలాలకు తరలించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ మేరకు ఆయన గురువారంనాడు తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో చర్చించారు.

ఆదే విషయంపై ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామమోహన్ రావుకు, ఎపి భవన్ రెసిడెంట్ కమిషనర్ సతీష్ చంద్రకు ఆదేశాలు జారీ చేశారు. శ్రీనగర్‌లోని ఎన్ఐటి చుట్టూ వరద ప్రవాహం చేరడంతో 250 మంది విద్యార్థులు చిక్కుకుపోయారు.

వారిలో 50 మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు. వీరిని కాశ్మీర్ విశ్వవిద్యాలయానికి తరలించగా, ఆ భవనాలు నీట మునిగాయి. దీంతో రోడ్డు మార్గంలో లెహ్‌కు చేరుకున్నారు. వీరిలో 33 మందిని సురక్షితంగా ఢిల్లీ తరలించారు.

తెలుగు విద్యార్థులపై బాబు

తెలుగు విద్యార్థులపై బాబు

ఢిల్లీకి చేరుకున్న 33 మంది తెలుగు విద్యార్థులను స్వస్థలాలకు చేర్చాలని చంద్రబాబు నాయుడు కంభంపాటి రామ్మోహన్ రావును, సతీష్ చంద్రను ఆదేశించారు.

తెలంగాణ విద్యార్థులను కూడా...

తెలంగాణ విద్యార్థులను కూడా...

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులతో పాటు తెలంగాణ రాష్ట్ర విద్యార్థులను కూడా సురక్షితంగా స్వస్థలాలకు తీసుకుని రావాలని చంద్రబాబు సూచించారు.

ఢిల్లీలో తెలుగు విద్యార్థులు

ఢిల్లీలో తెలుగు విద్యార్థులు

కాశ్మీర్ వరదల నుంచి తెలుగు విద్యార్థులు బస్సులో ఇలా ఢిల్లీకి చేరుకున్నారు. 33 మంది విద్యార్థులు దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నవారిలో ఉన్నారు.

విద్యార్థులతో కంభంపాటి

విద్యార్థులతో కంభంపాటి

ఢిల్లీకి చేరిన తెలుగు విద్యార్థులతో ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు ఇలా మాట్లాడుతూ కనిపించారు.

ఈ విద్యార్థులు బయటపడ్డారు..

ఈ విద్యార్థులు బయటపడ్డారు..

ఢిల్లీకి చేరుకున్న తెలుగు విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. వారిని స్వస్థలాలకు చేర్చేందుకు కంభంపాటి, సతీష్ చంద్ర ఏర్పాట్లు చేస్తున్నారు.

కంభంపాటితో విద్యార్థులు

కంభంపాటితో విద్యార్థులు

ఢిల్లీకి చేరుకున్న తెలుగు విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి కంభంపాటి రామమోహన్ రావుతో తమ అనుభవాలను వివరిస్తూ ఇలా...

తెలుగు విద్యార్థులకు భరోసా...

తెలుగు విద్యార్థులకు భరోసా...

జమ్మూ కాశ్మీర్ వరదల నుంచి బయటపడి, ఢిల్లీకి చేరుకున్న విద్యార్థులకు కంభంపాటి రామ్మోహన్ రావు భరోసా ఇచ్చారు.

విద్యార్థులు ఇలా..

విద్యార్థులు ఇలా..

జమ్మూ కాశ్మీర్ వరదల నుంచి బయటపడిన తెలుగు విద్యార్థులు బస్సులో ఢిల్లీ చేరుకుని హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.

మీడియాతో కంభంపాటి

మీడియాతో కంభంపాటి

జమ్మూ కాశ్మీర్ వరదల నుంచి బయటపడి ఢిల్లీ చేరుకున్న తెలుగు విద్యార్థులతో కలిసి కంభంపాటి రామ్మోహన్ రావు మీడియాతో మాట్లాడారు.

English summary
Andhra Pradesh Chief Minister Sri N. Chandrababu Naidu has directed government representative in Delhi Sri K. Ramamohan Rao and AP Bhavan resident commissioner Sri Satish Chandra to ensure that Telugu students from both Andhra Pradesh and Telangana are rescued from Srinagar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X