విభజన: భారతరత్నకు పివి పేరు, సీమాంధ్రుల వినతి..!

PV Narasimha Rao
న్యూఢిల్లీ/హైదరాబాద్: దివంగత భారత ప్రధానమంత్రి పివి నర్సింహా రావుకు భారతరత్న ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ముఖ్య నేత అయిన పివికి భారతరత్నను ఇవ్వాలని సిఫార్సు చేయడం గమనార్హం. ఆయనతో పాటు మరో 36 మందిని పద్మ పురస్కారాలకు సిఫార్సు చేసింది.

పివికి భారతరత్న ఇవ్వాలంటూ సీమాంధ్రకు చెందిన కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ప్రతిపాదించిన నేపథ్యంలో ఆయన పేరును రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసినట్లుగా తెలుస్తోంది. 1971-72లో జై ఆంధ్రా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసినప్పుడు కూడా రాష్ట్రం సమైక్యంగానే ఉండాలన్న పట్టుదలతో పివి వ్యవహరించారని వారు అంటున్నారు.

దేశ ఆర్థిక రంగాన్ని మలుపుతిప్పిన ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా పివికి పేరుంది. మంచి తత్వవేత్త అని, రాజనీతిజ్ఞుడని, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచిన సంస్కరణల రూపశిల్పి అని, దేశ సమగ్రతకు కృషి చేశారని, అటువంటి పివిని భారతరత్నతో సత్కరించాలని వారు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించారు.

ఈ నేపథ్యంలోనే పివి పేరును రాష్ట్ర ప్రభుత్వం భారతరత్న అవార్డుకు సిఫారసు చేసిందంటున్నారు. రావు బాలసరస్వతి, దాశరథి రంగాచార్య పేర్లను కూడా పద్మ అవార్డులకు సిఫారసు చేశారు. జాబితాను పరిశీలించి వారిలో కొంతమందిని ఎంపిక చేసి కేంద్రం రాష్ట్రపతికి నివేదిస్తుంది. ఈ నెల 25న పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించనుంది. 26న రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డులను అందజేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+