నా కూతుర్ని మోడీ లాగేశారు: తల్లి ఆగ్రహం, పోలీసులకు అనుప్రియ ఫిర్యాదు

Posted By:
Subscribe to Oneindia Telugu

లక్నో: ఉత్తర ప్రదేశ్ మీర్జాపూర్ అప్నాదళ్ ఎంపీ అనుప్రియా పటేల్‌ను ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గంలోకి తీసుకోవడాన్ని ఆ పార్టీ అధినేత్రి, అనుప్రియా తల్లి కృష్ణ పటేల్ తీవ్రంగా తప్పుబట్టారు. అప్నాదళ్ పార్టీని మోసం చేస్తూ, బీజేపీ ఆమెను లాగేసుకున్నారన్నారు.

తొలిసారి అనుప్రియ: ఆ ముగ్గురికి మోడీ ఛాన్స్ వెనుక

లోకసభ ఎన్నికల్లో కుర్మి వర్గం ఓట్ల కోసం తమను వాడుకున్న బీజేపీ, ఇప్పుడు మా కుటుంబాన్ని ముక్కలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ తప్పు చేసిందని, తన కుమార్తెను తనకు దూరం చేశారని ఆమె ఆరోపించారు.

Apna Dal claims a berth, but mother daughter tussle rages within

తనకు సమాచారం ఇవ్వకుండానే అనుప్రియకు మంత్రి పదవి ఇచ్చారన్నారు. ఇది ఎన్డీయే కూటమి నైతిక పైన ప్రశ్నలు సంధిస్తోందని చెప్పారు. ఇక నుంచి అప్నాదళ్ ఒంటరిగానే పోరు సాగిస్తుందని తెలిపారు. తన భర్త, పార్టీ వ్యవస్థాపకులు సోనేలాల్ పటేల్ లక్ష్య సాధనకు కృషి చేస్తానన్నారు.

స్మృతి తర్వాత అనుప్రియ: మోడీ చెక్ చేస్తున్నారా?

కాగా, అప్నాదళ్ పార్టీ నాయకత్వ బాధ్యతల అంశంలో తల్లీబిడ్డల మధ్య విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కుర్మి ఓటర్ల కోసం బీజేపీ అనుప్రియా పటేల్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్న విషయం తెలిసిందే.

ఫేక్ ట్విట్టర్ అకౌంట్ పైన అనుప్రియ ఫిర్యాదు

అనుప్రియ పటేల్ గురువారం నాడు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పేరిట ఫేక్ ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దాని ద్వారా తన ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారని ఆమె అన్నారు. ఆమె ఢిల్లీ పోలీస్ కమిషనర్ అలోక్ కుమార్‌కు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Apna Dal claims a berth, but mother daughter tussle rages within.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి