బీజేపీకి ఊపు తెస్తోన్న యూపీ పాలిటిక్స్..

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ : వచ్చే ఏడాది జరగబోయే ఉత్తరప్రదేశ్ రాజకీయాలు దేశ రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడి రాజకీయ పార్టీలన్ని యూపీ అధికార పీఠంపై ఇప్పటినుంచే ఫోకస్ చేయడం ప్రారంభించాయి.

ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకుంటోంది. యూపీలో బలంగా ఉన్న స్థానిక పార్టీలను 'ఢీ' కొనేందుకు ఇప్పటినుంచే పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది బీజేపీ.

ఈ నేపథ్యంలోనే యూపీకి చెందిన స్థానిక అప్నాదళ్ పార్టీ బీజేపీలో విలీనమవడం హాట్ టాపిక్ గా మారింది. వారణాశి-మీర్జాపూర్ పరిధిలో అప్నాదళ్ కు స్థానికంగా మంచి ఓటు బ్యాంకు ఉంది. తాజాగా అప్నాదళ్ బీజేపీలో విలీనం కావడంతో అప్నాదళ్ ఓటర్లంతా బీజేపీ ఖాతాలోకి చేరడం ఖాయమంటున్నారు పలువురు విశ్లేషకులు.

 Apna Dal merged with BJP in UP

ఓబీసీ ఓటర్లలో మంచి పట్టున్న అప్నాదళ్ బీజేపీలో విలీనమవడంతో, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి గెలుపు అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే అప్నాదళ్ పార్టీ తరుపున ప్రస్తుతం ఇద్దరు ఎంపీలు లోక్ సభలో ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

కాగా, మంగళవారం నాడు కేంద్రం మంత్రివర్గ విస్తరణను చేపడుతుండడంతో అప్నాదళ్ మీర్జాపూర్
ఎంపీ అనుప్రియకు కూడా ఎన్డీయే ప్రభుత్వం అవకాశం ఇవ్వవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Apna Dal party was merged with BJP in UP. Though this BJP got very big boost to the party mileage in uttaepradesh politics

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి