జయ ఆరోగ్యంపై అపోలో సంగీత రెడ్డి ట్వీట్, వారసుడిపై చర్చ, పన్నీరు సెల్వమేనా?
అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం పైన అపోలో ఆసుపత్రి ఈడీ సంగీతా రెడ్డి సోమవారం నాడు ట్వీట్ చేశారు.
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం పైన అపోలో ఆసుపత్రి ఈడీ సంగీతా రెడ్డి సోమవారం నాడు ట్వీట్ చేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మా వంతు ప్రయత్నాలు మేం చేస్తున్నామని పేర్కొన్నారు.
అప్పుడే వారసుడిపై చర్చలు
జయలలిత ఆరోగ్యం చాలా విషమంగా ఉందని సోమవారం నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆమె వారసుడు ఎవరు అనే చర్చ ప్రారంభమయింది. ఆమె వారసుడు పన్నీరు సెల్వం కావొచ్చునని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అందుబాటులో ఉన్నారు. జయలలిత వారసుడు ఎవరు అనే విషయమై వారి నుంచి డిక్లరేషన్లు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఎక్కువ మంది పన్నీరు సెల్వం వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలు జయ వారసుడిని ఎంపిక చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications