మొబైల్ ఫోన్ల విక్రయాల్లో మైక్రోమ్యాక్స్ ను వెనక్కి నెట్టిన ఆపిల్ కంపెనీ

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూడిల్లీ :ఇండియన్ మార్కెట్లో ఆపిల్ ఫోన్ల కంపెనీ గణనీయంగా వృద్దిని సాధించింది. దేశీయ మార్కెట్లో మైక్రో మాక్స్ ను వెనక్కి నెట్టి ఆపిల్ ఇండియా కంపెనీ తన స్థానాన్ని మెరుగుపర్చుకొంది. 54 శాతం వృద్దితో ఆపిల్ కంపెనీ 10 వేల కోట్ల అమ్మకాలు నమోదుచేసింది.

ఇండియా మార్కెట్లో మైక్రో మాక్స్ ఫోన్ల విక్రయాలు ఎక్కువగా ఉండేవి. అయితే ఆపిల్ ఇండియా మైక్రోమ్యాక్స్ ను వెనక్కు నెట్టింది. దేశీయ మొబైల్ రంగంలో ఇప్పటివరు రెండో స్థానంలో ఉన్న మైక్రోమ్యాక్స్ సంస్థ స్థానాన్ని ఆపిల్ ఇండియా ఆక్రమించింది.21 శాతం నికర లాభంతో 294 కోట్లను ఆర్జించింది.

 apple mobile company occupy the micromax mobiles place

గత ఏడాదిలో ఈ కంపెనీ 6472 కోట్ల ఆదాయాన్ని సాధించింది. అయితే ఇదే సమయంలో మెక్రో మ్యాక్స్ అమ్మకాలు 6 శాతం తగ్గిపోయాయి. చైనా నుండి వచ్చే సెల్ ఫోన్ కంపెనీల పోటీ కారణంగా మైక్రో మ్యాక్స్ కంపెనీ నష్టపోయింది.

ఆపిల్ తన పాత హ్యాండ్ సెట్ల ధరలను భారీగా తగ్గించింది, దరిమిలా ఎక్కువగా ఈ కంపెనీ ఫోన్ల విక్రయాలు పెరిగాయని మొబైల్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మిబైల్ ఫోన్ల విక్రయాల్లో సాంసంగం కంపెనీకిచెందిన ఫోన్ల విక్రయాల్లో తొలి స్థానంలో నిలిచాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
apple india company occupy the micromax place in india, apple mobile company 294 crores benfit i this year. micromax company cellphone sales 6 percentage decrease.bacause fo china phone sales. apple company decrease the rate of cell phone. this is also to increase the cellphones sales.
Please Wait while comments are loading...