శశికళ ఫ్యామిలీ మీద బాంబు వేసిన సీఎం: దినకరన్ విషయంలో ఏకగ్రీవ తీర్మానం, ఫినిష్ !
అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) ఉప ప్రధాన కార్యదర్శిగా టీటీవీ దినకరన్ నియామకం చెల్లదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి నేతృత్వంలో జరిగిన ఆ పార్టీ కార్యవర్గ సమావేశంలో నాయకులు తీర్మానించారు.
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) ఉప ప్రధాన కార్యదర్శిగా టీటీవీ దినకరన్ నియామకం చెల్లదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి నేతృత్వంలో జరిగిన ఆ పార్టీ కార్యవర్గ సమావేశంలో నాయకులు తీర్మానించారు. టీటీవీ దినకరన్ ను పార్టీ నుంచి పూర్తిగా దూరం పెట్టాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.
గురువారం చెన్నైలోని రాయపేట్ లోని అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ నాయకుల సమావేశం జరిగింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి సమావేశానికి అధ్యక్షత వహించారు. తమిళనాడు పలువురు మంత్రులు సమావేశానికి హాజరైనారు.

తమిళనాడులోని అన్ని జిల్లాల ప్రధాన కార్యదర్శలు, కీలకనేతలు సమావేశానికి హాజరైనారు. అన్నాడీఎంకే పార్టీ నియమాలకు వ్యతిరేకంగా టీటీవీ దినకరన్ ను ఉప ప్రధాన కార్యదర్శిగా నియమించారని ఎడప్పాడి పళనిసామి చెప్పారు.
మంత్రులు, అన్నాడీఎంకే (అమ్మ) వర్గం నాయకులు సీఎం ఎడప్పాడి పళనిసామి చేసిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. టీటీవీ దినకరన్ ను ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఈ దెబ్బతో శశికళ వర్గం మీద బాంబు పడినట్లు అయ్యింది. ఇక మిగిలింది శశికళ పదవి విషయం. శశికళ విషయంపై సమావేశంలో చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications