వ్యాక్సిన్ డబుల్ డోస్ తీసుకున్నారా ? ఓమిక్రాన్ వేరియంట్ నుంచి సురక్షితమేనా ? ఇది మీకోసమే

భారత్ లో దక్షిణాఫ్రికా కరోనా వైరస్ వేరియంట్ ఓమిక్రాన్ భయాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే భారత్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతున్న నేపథ్యంలో ఓమిక్రాన్ తమకు ఎక్కడ అంటుకుంటుందో అనే ఆందోళన ప్రతీ ఒక్కరిలో పెరుగుతోంది. ఈ జాబితాలో వ్యాక్సిన్ సింగిల్ డోస్, డబుల్ డోస్ తీసుకున్న వారు కూడా ఉన్నారు. దీంతో ఇప్పుడు డబుల్ డోస్ వేయించుకున్నా మనం సురక్షితం కాదా అన్న అనుమానాలు నెలకొన్నాయి. దీనిపై నిపుణులు ఏం చెప్తున్నారో ఓసారి చూసేద్దాం...

పెరుగుతున్న ఓమిక్రాన్ ముప్పు

పెరుగుతున్న ఓమిక్రాన్ ముప్పు

భారత్ లో ఓమిక్రాన్ ముప్పు పెరుగుతోంది. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా ఓమిక్రాన్ కారణంగా ఒక్క మరణం కూడా అధికారికంగా నమోదు కాలేదని ప్రపంచ ఆరోగ్యసంస్ధ చెప్తున్నా.. భారత్ లో మాత్రం ఎందుకో భయాలు పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సందర్భంగా భారత్ లో నెలకొన్న పరిస్ధితులే. అత్యంత వేగంగా వైరస్ వ్యాప్తి సాగిపోవడం, వ్యాక్సిన్లు కూడా పనిచేయని పరిస్ధితి సెకండ్ వేవ్ సమయంలో కనిపించడం వంటి కారణాలతో ఇప్పుడు భయాలు పెరుగుతున్నాయి. విదేశాల నుంచి రాకపోకలు తగ్గిపోతున్నా ఓమిక్రాన్ ఏం చేస్తుందో అన్న భయం మాత్రం ప్రతీ ఒక్కరినీ వెంటాడుతోంది. ఇది ముదిరితే మాత్రం ధర్డ్ వేవ్ వచ్చేసినట్లేన్న భయాలు నెలకొన్నాయి.

నత్తనడకన వ్యాక్సినేషన్

నత్తనడకన వ్యాక్సినేషన్


భారత్ లో కరోనా ముప్పు పూర్తిగా తొలగిపోలేదు. సెకండ్ వేవ్ సమయంలో వ్యాపించిన వైరస్ పూర్తిగా ఇంకా దేశాన్ని వదిలి వెళ్లిపోలేదు. ఇప్పటికీ పలు రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసులు, మరణాలే ఇందుకు నిదర్శనం. దీనికి తోడు తాజాగా ఓమిక్రాన్ ముప్పు కూడా పెరుగుతోంది. దీంతో గతంలో కేంద్రం ప్రారంభించిన వ్యాక్సినేషన్ ప్రక్రియను పరుగులు తీయించాల్సిన పరిస్ధితులు నెలకొంటున్నాయి. ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఓవైపు జనాల్లో వ్యాక్సిన్లపై అపోహలు తొలగిపోలేదు. మరోవైపు కరోనా వ్యాప్తి వేగం తగ్గిపోవడంతో కొన్ని నెలలుగా వ్యాక్సిన్లు వేయించుకునే వారే కరువయ్యారు. దీంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా నెమ్మదించింది.

 ఓమిక్రాన్ భయంతో మళ్లీ తెరపైకి

ఓమిక్రాన్ భయంతో మళ్లీ తెరపైకి


గతంలో వ్యాక్సిన్లు వేయించుుకున్న వారితో పాటు వ్యాక్సిన్లు వేయించుకోని వారికీ ఇప్పుడు ఓమిక్రాన్ వైరస్ భయం వెంటాడుతోంది. ముఖ్యంగా డబుల్ డోస్ వేయించుకున్న వారు సైతం ఓమిక్రాన్ తమకు సంక్రమిస్తుందా లేదా అన్నది తెలియక ఆందోళన చెందుతున్నారు. దీనికి ప్రధాన కారణం గతంలో కరోనా సెకండ్ వేవ్ సందర్భంగా డబుల్ డోస్ వేయించుకున్న ఎందరికో కరోనా సోకింది. వీరిలో చాలా మంది కరోనాతో పోరాడలేక చనిపోయారు కూడా. దీంతో ఈసారి ఓమిక్రాన్ వైరస్ పై తాము వేయించుకున్న వ్యాక్సిన్లు పనిచేస్తాయా లేదా అన్న ఆందోళన నెలకొంటోంది.

Recommended Video

    Hardik Pandya Action Plan For His Comeback | Teamindia || Oneindia Telugu
    డబుల్ డోస్ తీసుకుంటే సురక్షితమేనా ?

    డబుల్ డోస్ తీసుకుంటే సురక్షితమేనా ?


    డబుల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఓమిక్రాన్ ముప్పు ఉంటుందా లేదా అన్న అంశంపై పరిశోధనలు జరుపుతున్న శాస్త్రవేత్తలు... దీనిపై దాదాపుగా క్లారిటీ ఇచ్చేస్తున్నారు. వ్యాక్సిన్లు వేయించుకోని వారితో పోలిస్తే వ్యాక్సిన్లు అదీ డబుల్ డోస్ తీసుకున్న వారు ఓమిక్రాన్ వైరస్ బారిన పడే అవకాశాలు దాదాపు లేనట్లేనని చెప్తున్నారు చాలా తక్కుల సందర్భాల్లో మాత్రం వీరు ఓమిక్రాన్ వైరస్ ముప్పుకు గురవుతారని చెప్తున్నారు. అలా కాకుండా వ్యాక్సిన్ వేయించుకోకుండా తిరుగుతున్నవారు మాత్రం ఎక్కువగా ఆస్పత్రుల పాలయ్యే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు చెప్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+