వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్మీ డాగ్‌కు అరుదైన గౌరవం: ఉగ్రవాదిని పట్టించి, కాల్పుల్లో మరణించిన ‘ఆక్సెల్’కు ‘శౌర్య’

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత సైన్యంలోని సైనిక కుక్క(ఆర్మీ డాగ్) ఆక్సెల్‌కు అరుదైన గౌరవం దక్కింది. జులై నెలలో జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్‌లో ప్రాణత్యాగం చేసిన ఇండియన్ ఆర్మీ డాగ్ 'ఆక్సెల్' సోమవారం స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఈ ఏడాది గ్యాలంట్రీ అవార్డులలో మరణానంతరం 'మెన్షన్-ఇన్-డిస్పాచెస్'తో సత్కరించింది.

శౌర్య అందుకున్న ఏకైక ఆర్మీ డాగ్ ఆక్సెల్

శౌర్య అందుకున్న ఏకైక ఆర్మీ డాగ్ ఆక్సెల్

కాశ్మీర్ లోయలో ఒక ఉగ్రవాది కాల్పుల్లో మరణించిన ఈ శునకం.. తన పనికి అవార్డును అందుకున్న ఏకైక ఆర్మీ డాగ్ కావడం గమనార్హం. రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన జాబితా ప్రకారం.. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము సైనిక సిబ్బందికి 40 'మెన్షన్-ఇన్-డిస్పాచ్'లను ఆమోదించారు. ఒకటి వైమానిక దళ సిబ్బందికి, మరొకటి 'ఆక్సెల్' ఉన్నాయి. ఒకరి "కార్యకలాప ప్రాంతాలు, శౌర్య చర్యలలో విశిష్టమైన, ప్రతిభావంతమైన సేవను" గుర్తించడానికి 'మెన్షన్-ఇన్-డిపాచెస్' ఇవ్వబడింది.

ఆపరేషన్ రక్షక్‌లో పాల్గొన్న ఆక్సెల్

ఆపరేషన్ రక్షక్‌లో పాల్గొన్న ఆక్సెల్


"ఆపరేషన్ రక్షక్, ఆపరేషన్ స్నో లెపార్డ్, ఆపరేషన్ రినో, ఆపరేషన్ ఆర్చిడ్, ఆపరేషన్ ఫాల్కన్, ఆపరేషన్ హిఫాజాత్, ఆపరేషన్‌ త్రికూట్ (డియోఘర్) తో సహా వివిధ సైనిక కార్యకలాపాలలో గణనీయమైన సహకారాన్ని అందించినందుకు రాష్ట్రపతి 'మెన్షన్-ఇన్-డిస్పాచ్‌లను' ఆమోదించారని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 'ఆక్సెల్' 26 ఆర్మీ డాగ్ యూనిట్‌లో భాగం, ఆపరేషన్ రక్షక్‌లో పాల్గొంది.

ఉగ్రవాదిని పట్టించి.. కాల్పుల్లో మరణించిన ఆక్సెల్

రెండేళ్ల వయసున్న ఈ కుక్కకు జులై నెలలో జమ్మూ కాశ్మీర్‌లో సైనిక కార్యక్రమంలో నివాళులర్పించారు. ఇది అనేక బుల్లెట్ గాయాలను ఎదుర్కొంది. దాదాపు ఎనిమిది గంటల పాటు కాల్పులు జరిగిన భవనం వద్ద హోల్డ్-అప్ టెర్రరిస్ట్ స్థానాన్ని గుర్తించడంలో ఆర్మీ దళాలకు ఇది సహాయపడింది. కుప్వారా నివాసి అక్తర్ హుస్సేన్ భట్ అనే ఉగ్రవాదిని భద్రతా బలగాలు హతమార్చాయి. అతను నిషేధిత జైషే మహ్మద్‌తో సంబంధం కలిగి ఉన్నాడు.

ఆక్సెల్ సాయంతో ఆ ఉగ్రవాదిని మట్టుబెట్టిన ఆర్మీ బలగాలు


ఆర్మీ డాగ్ యూనిట్ 'బజాజ్' నుంచి మరొక కుక్క బిల్డింగ్‌ను క్లియర్ చేసిన తర్వాత ఎలైట్ అసాల్ట్ డాగ్, 'ఆక్సెల్' పని కోసం మోహరించాయి. 'ఆక్సెల్' మొదటి గదిని క్లియర్ చేసింది, కాని రెండవ గదిలోకి ప్రవేశించిన వెంటనే ఉగ్రవాది ఆ కుక్కపై కాల్పులు జరిపాడు. కుక్క 15 సెకన్ల పాటు కొన్ని కదలికలు చేయగలిగినప్పటికీ.. తరువాత కుప్పకూలిపోయిందని ఆర్మీ అధికారులు తెలిపారు. కాల్పులు ముగిసిన తర్వాత, సైన్యం ఘటనా స్థలం నుంచి 'ఆక్సెల్' మృతదేహాన్ని వెలికితీసింది. మొత్తం గ్యాలంట్రీ అవార్డులు - 'మెన్షన్-ఇన్-డిస్పాచ్‌లు' కాకుండా - ఈ సంవత్సరం ఇవ్వబడ్డాయి. ఇందులో మూడు కీర్తి చక్రాలు, 13 శౌర్య చక్రాలు, రెండు బార్ టు సేన పతకాలు, 81 సేన పతకాలు, ఒక నావో సేన పతకం, 7 వాయు సేన పతకాలు ఉన్నాయి.

English summary
Army dog ‘Axel’ gets bravery award, killed during Jammu & Kashmir anti-terrorist operation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X