బురదలో చిక్కుకున్న ప్రధాని నరేంద్ర మోడీ హెలికాప్టర్ (వీడియో)

బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటక రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేస్తున్నారు. అయితే, సింధనూరులో మంగళవారం కురిసిన భారీ వర్షం కారణంగా ప్రధాని నరేంద్ర మోడీ హెలికాప్టర్‌తో పాటు తోడుగా వెళ్తున్న ఆర్మీ హెలికాప్టర్ కొద్దిసేపు బురదలో చిక్కుకుంది.

చాలా సమయం శ్రమించిన తర్వాత.. హెలికాప్టర్‌ను బురదలో నుంచి బయటకు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కాగా, సింధనూర్‌లో ఒక సభలో ప్రసంగించిన తర్వాత ప్రధాని తన హెలికాప్టర్‌లో బయలుదేరిన తర్వాత, దాంతో పాటుగా ఉన్న ఆర్మీ హెలికాప్టర్ టేకాఫ్ ప్రారంభించి బురదలో కూరుకుపోయింది. కొంతసేపటి తర్వాత హెలికాప్టర్ అక్కడ్నుంచి బయల్దేరింది.

 Army helicopter

మరోవైపు, అంతకుముందు రోజు తెల్లవారుజామున, కాక్‌పిట్ అద్దానికి గాలిపటం ఢీకొనడంతో కాంగ్రెస్ కర్నాటక రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ హెలికాప్టర్ హెచ్‌ఎఎల్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.పక్షుల దాడిలో అద్దాలు దెబ్బతిన్నాయి, అయితే హెలికాప్టర్‌లోని శివకుమార్, సిబ్బంది, అతనిని ఇంటర్వ్యూ చేస్తున్న కన్నడ వార్తా ఛానెల్‌కు చెందిన జర్నలిస్టుతో సహా ఇతరులు క్షేమంగా ఉన్నారు.

ఇది ఇలావుండగా, కర్ణాటక రాష్ట్రంలో అధికారంలోని బీజేపీ తరపున ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కర్ణాటక అభివృద్ధి చెందాలంటే బీజేపీని గెలిపించాలంటూ ప్రజలను కోరారు. ఇక కాంగ్రెస్, ఇతర పార్టీల విమర్శలుకు ఘాటుగా కౌంటర్లు ఇచ్చారు. భజరంగ్‌దళ్‌పై నిషేధం విధిస్తామని కాంగ్రెస్‌ పార్టీ తన మేనిఫెస్టోలో చేసిన ఎన్నికల హామీపై ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం నాడు కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.

గతంలో శ్రీరాముడిని లాక్కెళ్లారని, ఇప్పుడు జై భజరంగబలి అని నినాదాలు చేసేవారిని లాక్కెళ్లాలని నిర్ణయం తీసుకున్నారని ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు. కర్నాటక రాష్ట్రంలోని హోస్‌పేట్‌లో ఎన్నికల సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. 'ఈ రోజు హనుమంతుని పవిత్ర భూమికి వచ్చి నమస్కరించడం తన అదృష్టమన్నారు. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో భజరంగబలిని లాక్ చేయాలని నిర్ణయించుకుందని మండిపడ్డారు. అంతకుముందు శ్రీరాముడిని లాక్కెళ్లారు, ఇప్పుడు జై భజరంగబలి అని నినాదాలు చేసేవారిని లాక్ చేయాలని వారు నిర్ణయం తీసుకున్నారు అని కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోడీ మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+