viral:రోడ్డుపై మద్యం తాగిన కటారియా.. వైరల్, అరెస్ట్ వారెంట్ జారీ

రోడ్డుపై మందు తాగుతూ.. సోషల్ మీడియాలో రచ్చ చేసిన వ్యక్తిపై పోలీసులు చర్యలకు ఉప క్రమించారు. అతనిపై అరెస్ట్ వారెంట్ జారీచేశారు. బాబీ కటారియాపై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ అయింది. రోడ్డు మధ్యలో కుర్చీలు వేసుకుని బహిరంగంగా మద్యం తాగిన కేసులో వారంట్ జారీ అయిందని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

అరెస్ట్ చేసేందుకు హర్యానాకు పోలీసు బృందాన్ని పంపామని డెహ్రాడూన్ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్ సింగ్ రావత్ తెలిపారు. రోడ్డు మధ్యలో మద్యం తాగుతున్న వీడియో వైరల్ అయిన తర్వాత అతడికి మూడు నోటీసులు పంపామని గుర్తుచేశారు. స్పందించలేదని.. దీంతో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశామని చెప్పారు.

బాబీ కటారియా వారం కింద వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. డెహ్రాడూన్ కంటోన్మెంట్ పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విమానం సీట్లో సిగరెట్ తాగిన వీడియోపై పౌరవిమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. జనవరి 20న ఢిల్లీ-దుబాయ్ విమానంలో ఘటన జరిగిందని స్పైస్‌జెట్ తెలిపింది. కటారియా పేరును 'నో ఫ్లైయింగ్' జోన్‌లో చేర్చామని కూడా తెలిపింది.

Arrest Warrant issued Against Liquor Stunt On Dehradun Road

రోడ్డు మీద మద్యం తాగుతూ కటారియా నానా రచ్చ చేశారు. ఈ రోడ్డు తన బాబు రోడ్డు అని బ్యాక్ గ్రౌండ్‌లో పాట కూడా వచ్చేది. ఆ వీడియో వైరల్ అయ్యింది. తర్వాత పోలీసులు మూడు సార్లు నోటీసులు పంపించారట.. ఇప్పుడు అరెస్ట్ వారెంట్ జారీచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+