హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

monsoon: అనుకున్నదానికంటే కొంత ఆలస్యంగానే కేరళలోకి నైరుతి రుతుపవనాలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు అనుకున్నదానికంటే కొన్ని రోజులు ఆలస్యంగా కేరళలో ప్రవేశించనున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్ 1 వరకు నైరుతి రుతుపవనాలు కేరళను చేరనున్నాయని పేర్కొంది. అయితే, అంతకుముందు మే 27నే కేరళలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసిన విషయం తెలిసిందే.

రావాల్సిన తేదీకి నాలుగు రోజుల ముందుగా గానీ, తర్వాత గానీ నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ ఎం మహపాత్ర వెల్లడించారు.
భారత వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటికే అండమాన్‌కు చేరుకున్న రుతుపవనాలు నైరుతి దిశలో అరేబియా సముద్రం వైపు వెళ్లే అవకాశం ఉంది.

గాలులు స్థిరత్వం, బలాన్ని పుంజుకుంటేనే రుతుపవనాలు కేరళకు వచ్చేందుకు పరిస్థితులు అనుకూలంగా మారుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అటువంటి అనుకూల పరిస్థితులు ఈ ప్రాంతంలో ఇంకా అభివృద్ధి చెందనందున, రుతుపవనాల ప్రారంభం మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

Arrival of monsoon in Kerala likely to get delayed: IMD

మే 29 వరకు కేరళలోని పలు జిల్లాలకు ఇచ్చిన ఎల్లో అలర్ట్‌ను వాతావరణ శాఖ విరమించుకుంది. అయితే, ఈ సమయంలో కొన్ని ప్రాంతాల్లో బలమైన గాలులతో పాటు వర్షం, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది.

నైరుతి రుతుపవనాలు రానున్న 48 గంటల్లో నైరుతి అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతం, దక్షిణ, తూర్పు మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల మీదుగా పురోగమించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

English summary
Arrival of monsoon in Kerala likely to get delayed: IMD.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X