వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెసుకు పట్టు లేదు: జైట్లీ, మాటలు చాలవు: సింఘ్వీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Arun Jailtey blames Congress for Loksabha incidents
న్యూఢిల్లీ: లోకసభలో గురువారం చోటు చేసుకుంటున్న సంఘటనలకు రాజ్యసభలో ప్రతిపక్ష నేత, బిజెపి సీనియర్ నేత అరుణ్ జైట్లీ కాంగ్రెసు పార్టీని నిందించారు. గురువారంనాటి సంఘటనలు ప్రజాస్వామ్యానికే మచ్చ తెచ్చాయని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. సమస్యకు కాంగ్రెసు పార్టీయే కారణమని ఆయన విమర్శించారు.

తన పార్లమెంటు సభ్యులపైనే కాంగ్రెసుకు పట్టు లేదని ఆయన అన్నారు. అరాచానికి దిగింది కాంగ్రెసువాళ్లేనని ఆయన అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఎటువంటి సమస్య లేకుండా మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయున గుర్తు చేశారు. పరిపాలన సాగించడంలో యుపిఎ ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. తెలంగాణ అంశంపై కాంగ్రెసు నిట్టనిలువునా చీలిందని ఆయన అన్నారు.

కాంగ్రెసువాళ్లు సభలో కలబడడం దారుణమని కాంగ్రెసు సీనియర్ నేత ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెసు పార్టీ జరిగిన సంఘటనలకు బాధ్యత వహించాలని ఆయన అన్నారు. పార్టీ పరిస్థితిని కాంగ్రెసు నాయకత్వం చక్కదిద్దుకోలేకపోతోందని ఆయన అన్నారు. వారి సభ్యులూ ఎంపీలే వెల్‌లోకి వెళ్తున్నారని ఆయన అన్నారు.

లోకసభలో జరిగిన సంఘటనను ఖండించడానికి మాటలు సరిపోవడం లేదని ఎఐసిసి అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ అన్నారు. రెచ్చగొట్టిన పరిస్థితులు లేకున్నా ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. అత్యంత విచారకరమైన సంఘటన అని ఆయన అన్నారు. జరిగిన సంఘటన అత్యంత బాధాకరంమని, క్షమార్హం కాదని ఆయన అన్నారు.

English summary
BJP leader Arun Jaitley blamed Congress leadership for incident occured in Loksabha on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X