వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవార్డు: ప్రణబ్ ముఖర్జీ ఎలైట్ లిస్ట్‌లో అరుణ్ జైట్లీ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ‘ఆసియా ఉత్తమ ఆర్థిక మంత్రి' అవార్డుకు ఎంపికయ్యారు. ప్రతి ఏటా ‘ఎమర్జింగ్ మార్కెట్స్' ఈ అవార్డును ప్రకటిస్తుంది. అరుణ్ జైట్లీ ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన 18 నెలల్లో భారత ఆర్థిక రంగం వృద్ధి సాధించింది.

ఇందుకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ రఘురాం రాజన్‌లే కారణమంటూ జాతీయంగానే కాక అంతర్జాతీయంగానూ ప్రచారం జరుగుతోంది. అయితే ఆ అభివృద్ధిలో ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా కీలకపాత్ర పోషించారని ‘ఎమర్జింగ్ మార్కెట్స్' వెల్లడించింది.

Arun Jaitley bags best FM of Asia award, joins Pranab Mukherjee in elite list

భారత ఆర్ధిక రంగాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన నిర్ణయాలు అత్యంత ముఖ్యమని వివరించింది. భారత ఆర్థిక వృద్దిలో కీలక భూమిక పోషిస్తున్న జైట్లీకి ఈ ఏడాది ‘ఆసియా ఉత్తమ ఆర్థిక మంత్రి' అవార్డును ప్రకటిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది.

సరిగ్గా ఐదేళ్ల క్రితం 2010లో అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ ఈ అవార్డు అందుకున్నారు. మళ్లీ ఐదేళ్ల తర్వాత ఈ అవార్డు మరో భారత ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీకి దక్కింది. దీంతో ‘ఆసియా ఉత్తమ ఆర్థిక మంత్రి' అవార్డు అందుకున్న ఎలైట్ లిస్ట్‌లో అరుణ్ జైట్లీ కూడా చేరిపోయారు.

English summary
Finance Minister Arun Jaitley has been chosen as 'Finance Minister of the Year, Asia' by London-based publication Emerging Markets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X