అరుణ్ జైట్లీ బడ్జెట్: తీపి కబుర్లు, చేదు మాత్రలు
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం లోకసభలో తన బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఆ బడ్జెట్‌లకు తీపి కబుర్లు మాత్రమే కాకుండా చేదు మాత్రలు కూడా ఉన్నాయి. రెండింటినీ సమన్వయం చేస్తూ ఆయన తన బడ్జెట్‌ను ప్రతిపాదించారు.
తీపి కబుర్లు
వారణాసిలో చేనేత పనులను ప్రోత్సహించడానికి ట్రేడ్ పెసిలిటేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తారు.
సెజ్‌లను పునరుద్ధరించడానికి సమర్థమైన చర్యలు తీసుకుంటామని జైట్లీ చెప్పారు.
ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీలోగా అన్ని ప్రభుత్వ శాఖలను, మంత్రిత్వ శాఖలను అనుసంధానం చేస్తామని అన్నారు.
నాబార్డ్ ద్వారా ఐదు లక్షల భూమిలేని నిరుపేదలకు ఐదు లక్షల ఆర్థిక సహాయం అందిస్తారు.
మెట్రో నెట్‌వర్క్స్‌ను పిపిపి మోడ్ పద్ధతిలో అభివృద్ధి చేస్తారు. ఆహ్మదాబాద్, లక్నో మెట్రో పథకాలకు 100 కోట్ల రూపాయలు కేటాయిస్తారు.
రూ. 500 కోట్ల రూపాయలతో జాతీయ గ్రామీణ ఇంటర్నెట్, టెక్నాలజీ మిషన్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

చేదు మాత్రలు
ఆర్థికపరమైన జాగ్రత్తలను పాటించాల్సిన అవసరం ఉందని జైట్లీ చెప్పారు.
రైలు బడ్జెట్‌లో పశ్చిమ బెంగాల్‌ను విస్మరించారు. ఈ బడ్టెట్‌లో ఆ ప్రస్తావన ఏమీ లేదు.
పెరిగిన రైలు చార్జీలను తగ్గించే ప్రసక్తి లేదు.
ముడిచమురు ధరలు సూరత్ చేనేత కార్మికులకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది.
ధరల పెరుగుదలపై కాంగ్రెసు ప్రభుత్వంపై విరుచుకుపడే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications