వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓ మంత్రి నాపై దాడికి యత్నించారు: గవర్నర్

|
Google Oneindia TeluguNews

ఈటానగర్: అరుణాచలప్రదేశ్‌ రాష్ట్ర మంత్రే స్వయంగా తనపై దాడికి ప్రయత్నించారని ఆ రాష్ట్ర గవర్నర్‌ జేపీ రాజ్‌ఖోవా ఆరోపించారు. ఈ మేరకు ఓ నివేదికను గురువారం మధ్యాహ్నం ఆయన ఓ సీల్డ్‌ కవర్‌ ద్వారా సుప్రీంకోర్టుకు సమర్పించే అవకాశం ఉంది.

రాష్ట్రంలో దిగజారుతున్న శాంతి భద్రతల అంశాన్ని కూడా ఆయన ఆ నివేదికల ద్వారా సుప్రీంకు తెలియజేయనున్నారు.అప్పటి ముఖ్యమంత్రి నబమ్‌ టుకి మంత్రివర్గంలోని మంత్రులు గత డిసెంబరు 14న గవర్నర్‌ని కలిసేందుకు వెళ్లారు.

Arunachal Pradesh Governor claims state minister tried to assault him

రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్ని ముందుకు జరపాలని గవర్నర్‌ వారికి సూచించారు. ఆ సందర్భంలో అక్కడున్న మంత్రి ఒకరు తనపై దాడి చెయ్యడానికి యత్నించారని రాజ్‌ఖోవా ఆరోపించారు. రాజ్‌భవన్ వచ్చే దారిని కూడా ముఖ్యమంత్రి మనుషులు మూసివేశారని చెప్పారు.

రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు వివరిస్తూ జనవరి 18న రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ కోరారు. ఈ నేపథ్యంలో గత మంగళవారం నుంచి రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే.

English summary
In his report in which he recommended President's rule in the state, Arunachal Pradesh Governor JP Rajkhowa's has claimed that a minister tried to assault him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X