దయ చేసి ప్లే చేయండి: యాంకర్‌ను కోరిన కేజ్రివాల్

న్యూఢిల్లీ: తను ఇచ్చిన ఇంటర్వ్యూలోని ఓ భాగాన్ని పదే పదే చూపాలని ఓ టీవి యాంకర్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రివాల్ కోరినట్లు ఉన్న వీడియో యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇంటర్వ్యూ తర్వాత టీవి యాంకర్‌కు, అరవింద్ కేజ్రివాల్‌కు మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆ వీడియో నిమిషానికిపైగానే ఉంది.

ఆ సంభాషణలో తను ఇచ్చిన ఇంటర్య్వోలోని ముఖ్యమైన భాగానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరాడు. దయచేసి ఇంటర్వ్యూలో బాగా వచ్చిన ఆ భాగాన్ని పదే పదే ప్రసారం చేయాలని యాంకర్‌కు కేజ్రివాల్ విజ్ఞప్తి చేశారు.

Arvind Kejriwal

అందుకు సమాధానంగా ఆ యాంకర్ బదిలిస్తూ.. ‘తప్పకుండా ప్రసారం చేస్తాం. భగత్ సింగ్ కామెంట్ చాలా బాగుంది. దీనిపై చాలా ప్రతిస్పందనలు వచ్చే అవకాశం ఉంది' అని చెప్పారు. అరవింద్ కేజ్రివాల్ ఈ ఇంటర్వ్యూని ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ఇచ్చినట్లు సమాచారం.

కాగా, ఇటీవల అరవింద్ కేజ్రివాల్ మీడియాపై విమర్శలు గుప్పించిన తర్వాతే ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన సంభాషణలు బయటికి వచ్చినట్లు తెలుస్తోంది. పలువురి కుట్రలో భాగంగానే తనపై మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని అరవింద్ కేజ్రివాల్ ఆరోపణలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+