వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన కేజ్రీవాల్... ఎవరెవరికి ఏయే శాఖ(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ 8వ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మధ్యాహ్నాం 12.15 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ప్రమాణం చేయించారు.

కేజ్రీవాల్ అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర నేత, డిప్యూటీ సీఎం మనీష్ సిపోడియా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత మంత్రులుగా సత్యేంద్ర జైన్, జితేంద్ర తోమర్, గోపాల్ రాయ్, సందీప్‌కుమార్, ఆసిం అహ్మద్ ఖాన్‌‌లతో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ప్రమాణం చేయించారు.

ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అరవింద్ కేజ్రీవాల్, వెంటనే తన మంత్రి వర్గాన్ని విస్తరించారు. కొత్త మంత్రులకు శాఖలను కూడా కేటాయించారు. సందీప్ కుమార్ (శిశు సంక్షేమం), సత్యేంద్ర జైన్ (వైద్య ఆరోగ్యం), గోపాల్ రాయ్ (రవాణా, కార్మిక శాఖ), జితేంద్ర తోమర్ (న్యాయ శాఖ) కేటాయించినట్లు తెలుస్తోంది.

రామ్‌లీలా మైదానంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ప్రమాణ స్వీకారంలో పాల్గొనేందుకు అరవింద్ కేజ్రీవాల్ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం ఉదయం 10.30కి ఇంటినుంచి బయలుదేరారు.

సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన కేజ్రీవాల్

సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన కేజ్రీవాల్

దేశ రాజధాని ఢిల్లీ 8వ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మధ్యాహ్నాం 12.15 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ప్రమాణం చేయించారు.

సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన కేజ్రీవాల్

సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన కేజ్రీవాల్

కేజ్రీవాల్ అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర నేత, డిప్యూటీ సీఎం మనీష్ సిపోడియా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత మంత్రులుగా సత్యేంద్ర జైన్, జితేంద్ర తోమర్, గోపాల్ రాయ్, సందీప్‌కుమార్, ఆసిం అహ్మద్ ప్రమాణం చేయించారు.

సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన కేజ్రీవాల్

సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన కేజ్రీవాల్

ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అరవింద్ కేజ్రీవాల్, వెంటనే తన మంత్రి వర్గాన్ని విస్తరించారు. కొత్త మంత్రులకు శాఖలను కూడా కేటాయించారు. సందీప్ కుమార్ (శిశు సంక్షేమం), సత్యేంద్ర జైన్ (వైద్య ఆరోగ్యం), గోపాల్ రాయ్ (రవాణా, కార్మిక శాఖ), జితేంద్ర తోమర్ (న్యాయ శాఖ) కేటాయించినట్లు తెలుస్తోంది.

సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన కేజ్రీవాల్

సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన కేజ్రీవాల్

రామ్‌లీలా మైదానంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ప్రమాణ స్వీకారంలో పాల్గొనేందుకు అరవింద్ కేజ్రీవాల్ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం ఉదయం 10.30కి ఇంటినుంచి బయలుదేరారు.

సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన కేజ్రీవాల్

సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన కేజ్రీవాల్

రామ్‌లీలా మైదానంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరైన గుల్ పనాగ్, రాహుల్ మెహ్రా హాజరైన దృశ్యం.

కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం కోసం ఆమ్ ఆద్మీ కార్యకర్తలు రామ్ లీలా మైదానాన్ని సర్వాంగ సుందరగా ముస్తాబు చేశారు. 35 వేల మందిని కూర్చోనేందుకు వీలుగా కుర్చీలను ఏర్పాటు చేశారు. 9 వాటర్ ట్యాంకర్స్‌ను అందుబాటులో ఉంచారు. 7 మొబైల్ టాయిలెట్స్‌ను ఏర్పాటు చేశారు.

మైదానంలోకి లోపలికి, బయటకు వెళ్లేందుకు 6 గేట్లను ఏర్పాటు చేశారు. ప్రతి గేటు వద్ద మెటల్ డిటేక్టర్లను ఏర్పాటు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరిని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ రావాలని ఢిల్లీ ప్రజలను కేజ్రీవాల్ రేడియోలో ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఢిల్లీ అసెంబ్లీలో ఉన్న 70 స్ధానాలకు గాను ఆమ్ ఆద్మీ పార్టీ 67 స్ధానాలను కైవసం చేసుకుని అతి పెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే.

English summary
Arvind Kejriwal to be sworn in as Delhi CM at Ramlila Maidan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X