వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేజ్రివాల్ మరో సంచలనం-పోటీ పరీక్షలవిద్యార్ధులకు వర్చువల్ స్కూల్ ప్రారంభం-దేశవ్యాప్తంగా అందరికీ

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ దేశవ్యాప్తంగా విద్యార్ధులకు ఉపయోగపడేలా వర్చువల్ స్కూల్‌ను ప్రారంభించారు. ఇందులో ప్రవేశానికి అన్ని రాష్ట్రాల్లో విద్యార్ధులు అర్హులేనని ప్రకటించారు. ఢిల్లీ మోడల్ వర్చువల్ స్కూల్ (DMVS) పేరుతో దీన్ని కేజ్రివాల్ ప్రారంభఇంచారు. ఇందులో దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ ఇవాళే ప్రారంభమైంది. 9-12 తరగతుల విద్యార్ధులకు ఈ స్కూల్ ఉపయోగపడనుంది.

కేజ్రివాల్ ప్రారంభించిన ఢిల్లీ మోడల్ వర్చువల్ స్కూల్లో విద్యార్ధులకు నైపుణ్య ఆధారిత శిక్షణతో పాటు నీట్, క్యూట్, జేఈఈ పరీక్షలకు శిక్షణ ఇస్తారు. ఇది దేశంలోనే తొలి వర్చువల్ స్కూల్ అని, విద్యారంగంలో ఓ మైలురాయిగా నిలుస్తుందని కేజ్రివాల్ ప్రకటించారు. ఇప్పటికే పాఠశాలలకు దూరంగా ఉండటం లేదా ఇతర అడ్డంకులు ఎదుర్కొంటున్న విద్యార్ధులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. చాలా మంది తల్లిదండ్రులు తమ కుమార్తెలను బయటకు పంపడానికి ఇష్టపడకపోవడంతో వారికి చదువు చెప్పించడం లేదని కేజ్రివాల్ గుర్తుచేశారు.

Arvind Kejriwals delhi model virtual school launched for students across the country

ఇలాంటి వారిని విద్యావంతుల్ని చేసేందుకు తాము ఈ వర్చువల్ పాఠశాలను ప్రారంభిస్తున్నామని కేజ్రివాల్ వెల్లడించారు.ఈ పాఠశాల కోవిడ్ మహమ్మారి కారణంగా నిర్వహించిన వర్చువల్ క్లాస్ ల స్ఫూర్తితో ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో క్లాసులు ఆన్‌లైన్‌లో ఉంటాయని, రికార్డ్ చేసిన ఉపన్యాసాలు కూడా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తామని కేజ్రీవాల్ వెల్లడించారు. దీంతో ఇప్పటికే ఢిల్లీలో విజయవంతంగా నిర్వహిస్తున్న విద్యావిధానంపై అంతర్జాతీయంగా లభిస్తున్న ప్రశంసలతో కేజ్రివాల్ ఈ స్కూల్ ప్రారంభించినట్లు తెలుస్తోంది.

English summary
delhi cm arvind kejriwal has launched delhi model virtual school for students across the coutry today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X