మోడీ గురించి రాహుల్ అప్పుడే చెప్పలేదేం, అంటే ఏదో ఉంది: కేజ్రీవాల్

గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ముడుపులు తీసుకున్నారన్న ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఆరోపణల పైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం నాడు స్పందించారు.

న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ముడుపులు తీసుకున్నారన్న ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఆరోపణల పైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం నాడు స్పందించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాని మోడీ రాజీనామా చేయాలన్నారు.

అదే సమయంలో, మోడీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆయన అవినీతి విషయాలను కాంగ్రెస్‌ ఎందుకు వెలుగులోకి తీసుకు రాలేదో చెప్పాలని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. ఎందుకంటే బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి మధ్య ఒప్పందం ఉందన్నారు.

arvind kejriwal

ఇందుకు సంబంధించి కేజ్రీవాల్‌ గురువారం ఓ వీడియో ప్రకటన చేశారు. మోడీ ప్రధాని కాకముందు వరకు 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం దేశంలో అధికారంలో ఉందని, 2013లో బిర్లా సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేసినపుడు లభించిన పత్రాల్లో మోడీ పేరు ఉండటాన్ని గమనించారని, ఆ సమయంలో బీజేపీ తరఫు నుంచి మోడీ ప్రధాని రేసులో మాత్రమే ఉన్నారని చెప్పారు.

కేంద్రంలో కాంగ్రెస్‌ ఉందని, మరి ఆ సమయంలో ఎందుకని ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకు రాలేదని ప్రశ్నించారు. అంటే ఆ సమయంలో వారిద్దరి మధ్య ఒప్పందం ఏమైనా ఉందా? అందుకే విషయాలను బహిర్గతం చేయలేదా? అని నిలదీశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+