వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు: ఆపని మాత్రం చెయ్యోద్దు ఫ్లీజ్, సీఎం కేజ్రీవాల్ మనవి, సంబరాలు, హామీ ఇచ్చాం !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ భారీ ఆధిక్యంతో దూసుకెళ్తోంది. కేజ్రీవాల్ హ్యాట్రీక్ కొడతారని అప్పుడే ఢిల్లీలో అమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు సంబరాలు మొదలు పెట్టారు. అయితే ఢిల్లీలో వాయు కాలుష్యం నివారించడానికి ఆప్ కార్యకర్తలు టపాకాయలు (బాణాసంచా) కాల్చరాదని అమ్మ ఆద్మీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పార్టీ కార్యకర్తలకు మనవి చేశారు. ఢిల్లీలో రోజురోజుకు వాయు కాలుష్యం పెరిగిపోతుందని, ఇలాంటి సమయంలో మనం టపాకాయలు కాల్చడం మంచి పద్దతి కాదని, వాయు కాలుష్యం తగ్గిస్తామని మనం ఎన్నికలకు ముందు ప్రజలకు హామీ ఇచ్చామని అరవింద్ కేజ్రీవాల్ గుర్తు చేశారు. దయచేసి టపాకాయలు కాల్చరాదని ఆప్ కార్యకర్తలకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆప్ కార్యకర్తలకు సూచించారు.

ఇది విన్నారా ? లవ్: ముహూర్తం చీరకు అంచు బాగలేదని పెళ్లి నిలిపేసిన పెళ్లి కుమార్తె, ఇంత పొగరా !ఇది విన్నారా ? లవ్: ముహూర్తం చీరకు అంచు బాగలేదని పెళ్లి నిలిపేసిన పెళ్లి కుమార్తె, ఇంత పొగరా !

 ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్

ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా అమ్ ఆద్మీ పార్టీ ఘనవిజయం దిశగా దూసుకుపోతుంది. ఇప్పటకే 55 స్థానాల్లో అమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇలాంటి సమయంలో అమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకోవడానికి పెద్ద ఎత్తున ప్లాన్ వేసుకున్నారు.

 సీఎం ఇంటి ముందు సందడి

సీఎం ఇంటి ముందు సందడి

మంగళవారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటి దగ్గరకు అమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు క్యూ కట్టారు. ఉదయం నుంచి సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ముందు సందడి నెలకొంది. ఎన్నికల ఫలితాల్లో సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం, అమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియా ఆధిక్యంలో దూసుకుపోవవడంతో ఆప్ కార్యకర్తల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.

 నా మాట వినండి

నా మాట వినండి

అమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు విజయోత్సవాలు జరుపుకోవడానికి పెద్ద ఎత్తున సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ముందు గుమికూడారు. మనం విజయం సాధిస్తామని, కచ్చితంగా మళ్లీ అధికారంలోకి వస్తామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. అయితే విజయోత్సవాలు జరుపుకోవడానికి సిద్దం అయిన కార్యకర్తలు దయచేసి క్రాకర్స్ (బాణాసంచా) కాల్చరాదని, వాయు కాలుష్యం ఎక్కువ అవుతోందని, దయచేసి తన మాట వినాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆప్ కార్యకర్తలకు మనవి చేశారు.

ఆప్ కార్యాలయం

ఆప్ కార్యాలయం

ఢిల్లీలోని ITOలోని ఆఫ్ పార్టీ ప్రధాన కార్యాలయంతో పాటు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ముందు విజయోత్సవ సంబరాలు జరుపుకోవడానికి అమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు సిద్దం అయ్యారు. ఇప్పటికే పెద్ద ఎత్తున స్వీట్లు, నామ్ కీన్ లు అర్డర్ చేశారు. ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడిన వెంటనే సంబరాలు జరుపుకోవాలని ఆప్ కార్యకర్తలు నిర్ణయించారు.

 ఎన్నికల హామీల్లో వాయు కాలుష్యం !

ఎన్నికల హామీల్లో వాయు కాలుష్యం !

అమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోతో పాటు హామీ కార్డుల్లో ఆప్ ఇచ్చిన ప్రధాన హామీల్లో ఢిల్లీలో వాయు కాలుష్యం పూర్తిగా తగ్గిస్తామని హామీలు ఇచ్చారు. ఇలాంటి సమయంలో అధికారంలోకి వస్తున్న ఆప్ విజయోత్సవాల్లో టపాకాయలు కాల్చితే ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లు అవుతోందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అంటున్నారు. అందుకే విజయోత్సవాల్లో టపాకాయలు మాత్రం కాల్చరాదని, తన మాటకు విలువ ఇవ్వాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆప్ కార్యకర్తలకు మనవి చేశారు.

English summary
Delhi CM Arvind Kejriwal has asked party volunteers not to burst firecrackers as it contributes to pollution.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X