తరిగిన సంపద .. పెరిగిన కేసులు: కేజ్రివాల్ అఫిడవిట్, బేడీ ఆస్తులివే

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రిటర్నింగ్ అధికారికి అందజేసిన అఫిడవిట్‌లో ఆదాయ, వ్యయాలు వెల్లడించారు. నిరుడు లోక్‌సభ ఎన్నికల్లో కేజ్రీవాల్ ఆయన భార్య పేరున ఆస్తులు 2.09 కోట్లు చూపించారు. తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లు సందర్భంగా అప్పుడు పేర్కొన్నదానితో పోలిస్తే 5 లక్షల రూపాయలు తక్కువగా చూపారు.

అయితే తనపై లీగల్ కేసులు మాత్రం పెరిగాయని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల అధికారులకు అందజేసిన తాజా అఫిడవిట్‌లో చరాస్తులు 2.26 లక్షలు. ఆయన భార్య పేరున 300 గ్రాముల బంగారు ఆభరణాలు (9లక్షలు), 25 గ్రాముల వెండి (24వేలు)తో కలిపి 15.28 లక్షలు. లోక్‌సభ ఎన్నిలక సందర్భంలో చరాస్తులు 4.25 లక్షలు చూపించారు. భార్య సునీత పేరున 17.41 లక్షలు చూపించారు. స్థిరాస్తుల్లో మూడు ఫ్లాట్లు పేర్కొన్నారు.

తాజా అఫిడవిట్‌లో వాటిలో ఎలాంటి మార్పూలేదు. ఎటొచ్చి నగదే తగ్గినట్టు చూపించారు. తనపై పది కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. లోక్‌సభ నాటి అఫిడవిట్‌లో వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు ఏడుగా చూపించారు.

Arvind Kejriwal Has Less Money and More FIRs Than He Had During 2014 polls

కిరణ్ బేడీ కుటుంబ ఆస్తుల విలువ 11.65 కోట్లు

ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ తరఫున పోటీచేస్తున్న మాజీ ఐపిఎస్ అధికారి కిరణ్ బేడి తన కుటుంబ ఆస్తుల వివరాలను ప్రకటించారు. తనకు, తన భర్తకు ఉన్న స్థిర చరాస్తులను నామినేషన్ పత్రాలతో పాటు దాఖలు చేసిన అఫిడవిట్‌లో వివరించారు. కిరణ్‌బేడి కృష్ణానగర్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీచేస్తున్న విషయం తెలిసిందే.

తనకు, తన భర్తకు ఉన్న మొత్తం ఆస్తుల విలువ 11.65 కోట్లుగా ఆమె పేర్కొన్నారు. తనకు సంబంధించి ఏ కోర్టులోనూ ఒక్క కేసు కూడా పెండింగ్‌లో లేదని వివరించారు. తనకు రూ.11,04,02,677 విలువ కలిగిన స్థిర, చరాస్తులు ఉన్నాయని, తన భర్తకు రూ. 61,35,528 విలువ కలిగిన ఆస్తులున్నాయని అఫిడవిట్‌లో కిరణ్ బేడీ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+