Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌పై కోర్టుకెళ్లిన ఈడీ..

మద్యం పాలసీ కేసుకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు జారీ చేసిన సమన్లను పాటించడం లేదంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోర్డును ఆశ్రయించింది. ఈడీ జారీ చేసిన సమన్లను పాటించనందుకు, మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 50 ప్రకారం హాజరుకానందుకు IPC సెక్షన్ 174 కింద ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసును ఫిబ్రవరి 7న కోర్టు విచారణకు స్వీకరించనుంది.

ఇప్పటి వరకు కేంద్ర దర్యాప్తు సంస్థ అరవింద్ కేజ్రీవాల్‌కు ఐదు సమన్లు జారీ చేసింది. మద్యం పాలసీ కుంభకోణంపై జరుగుతున్న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో కోరింది. కేజ్రీవాల్ తనను అరెస్ట్ చేసేందుకు చేస్తున్న "చట్టవిరుద్ధమైన" ప్రయత్నాలంటూ సమన్లను దాటవేశారు. కేజ్రీవాల్ 2023లో నవంబర్ 2, డిసెంబర్ 21, ఈ ఏడాది జనవరి 3, జనవరి 18, ఫిబ్రవరి 2 తేదీల్లో ఈడీ కేజ్రీవాల్కు సమన్లను జారీ చేసింది.

Arvind Kejriwal is not attending the trial, ED approached the court

లిక్కర్ వ్యాపారులకు లైసెన్సులు మంజూరు చేయడానికి 2021-22కి ఢిల్లీ ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీ కార్టలైజేషన్‌ను అనుమతించిందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పేర్కొంది. దాని కోసం లంచాలు చెల్లించినట్లు ఆరోపణలు వచ్చినట్లు చెప్పింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఎక్సైజ్ పాలసీని రద్దు చేయడమే కాకుండా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారణకు సిఫారసు చేశారు. ఆ తర్వాత ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద కేసు నమోదు చేసింది.

లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ ముఖ్యమంత్రి కూతురు కల్వకుంట్ల కవితకు కూడా ఈడీ నోటిసులు జారీ చేసింది. ఈడీ విచారణకు తాను హాజరుకాలేనని కవిత లేఖ రాసిన సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+