మోడీకి షాక్: ఈడీ నోటీసులపై అరవింద్ కేజ్రీవాల్ సంచలనం
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తనకు జారీ అయిన సమన్లను వాపస్ తీసుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు లేఖ రాశారు. ఆ నోటీసులు పూర్తిగా రాజకీయ కక్షతో చేసినవని అభివర్ణించారు. షెడ్యూల్ ప్రకారం ఈరోజు ఆయన ఈడీ కార్యాలయంలో హాజరుకావాల్సి ఉంది. అరవింద్ కేజ్రీవాల్ కు సమన్లు జారీచేయడాన్ని వ్యతిరేకిస్తూ ఈడీ కార్యాలయం సమీపంలో ఆప్ కార్యకర్తలు గుమిగూడకుండా భద్రతా ఏర్పాట్లను భారీస్థాయిలో చేశారు.
తుగ్లక్ రోడ్డులోని ఈడీ కార్యాలయం వద్ద పోలీసు యంత్రాంగం బారికేడ్లు ఏర్పాటు చేసింది. పోలీసులు, పారా మిలిటరీ బలగాలను భారీస్థాయిలో మొహరించారు. డీడీయూ మార్గ్ లోని బీజేపీ కార్యాలయానికి వెళ్లే మార్గంలో, ఐటీవో ప్రాంతంలోని ఆప్ కార్యాలయం వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇండియా గేట్, వికాస్ మార్గ్, ఐటీవో ప్రాంతంతో ట్రాఫిక్ కు కొంతమేరకు అంతరాయం కలుగుతోంది. కేజ్రీవాల్ రాజ్ ఘాట్ వద్ద నివాళులర్పించేందుకు వెళారని వార్తలు రావడంతో అక్కడ కూడా భద్రతను పెంచారు.

ఈడీ సమన్లపై స్పందించిన కేజ్రీవాల్.. అవి చట్టవిరుద్ధమని, బీజేపీ సూచన మేరకే అవి పంపించారని, త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లనీయకుండా తనను అడ్డుకోవడానికే ఇలా చేశారన్నారు. ఈడీ ఎదుట హాజరు కాకూడదని నిర్ణయించుకున్న అరవింద్ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ తో కలిసి మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్నారు. దీంతో ఈడీ ఆయనకు కొత్త తేదీతో మరోసారి సమన్లు జారీచేసే అవకాశం ఉంది. కేజ్రీవాల్ ను చూసి ప్రధానమంత్రి మోడీ భయపడుతున్నారని, ఎన్నికల్లో ఆప్ ను ఓడించలేమని బీజేపీకి అర్థమైందని ఆప్ వర్గాలు వ్యాఖ్యానించాయి.












Click it and Unblock the Notifications