Arvind Kejriwal తగ్గట్లేదుగా.. ఓవైపు కోర్టులో పోరాటం; మరోవైపు అసెంబ్లీ సమావేశం!!

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులతో అరెస్టై ఈడీ విచారణను ఎదుర్కొంటున్న అరవింద్ కేజ్రీవాల్ కస్టడీలో ఉన్నప్పటికీ ఢిల్లీలో పాలన సాగించడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. అరవింద్ కేజ్రివాల్ ఈడి కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్న సమయంలో కూడా నేడు ఢిల్లీలో అసెంబ్లీ సమావేశం జరుగుతుంది. సీఎం కేజ్రీవాల్ లేకుండానే జరుగుతున్న ఈ అసెంబ్లీ సమావేశం పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

అయితే నేడు జరగనున్న అసెంబ్లీ సమావేశాలలో వైద్య సదుపాయాల కల్పనపై చర్చ జరగనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే విచారణ ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ ఈడి అధికారులు తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నేడు అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ విచారణ జరగనుంది. అయితే ఈ పిటిషన్ విచారణలో అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట లభిస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది.

Arvind Kejriwal Petition hearing in High Court Delhi Assembly meeting without Kejriwal

మరోవైపు ఈడి కస్టడీని ఎదుర్కొంటున్నప్పటికీ అరవింద్ కేజ్రీవాల్ కస్టడీ నుంచి ఢిల్లీ పరిపాలనకు సంబంధించిన అనేక ఆదేశాలు ఇవ్వడం ఇప్పుడు ఈడీ అధికారులకు తలనొప్పిగా మారింది. అసలు పేపర్లు, కంప్యూటర్లు ఏది అందుబాటులో లేని క్రమంలో అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాలు ఏ విధంగా ఇస్తున్నారు? అన్నది ఈడి సీరియస్ గా తీసుకుంది.

ఇప్పటివరకు కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల నీటి సమస్యల పైన, మొహల్లా ఆసుపత్రులలో ఉచిత మందులు, వైద్య పరీక్షలకు సంబంధించిన అంశాలపైన ఆయా శాఖల మంత్రులకు పరిపాలన ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఈ ఆదేశాలు అందుకున్న మంత్రులను ఈడీ విచారించాలని నిర్ణయించింది. వారిని పిలిచి ఈడి అధికారులు విచారణ జరపనున్నారు.

ఇదిలా ఉంటే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా స్పందించింది. భారత్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని అమెరికా పేర్కొంది. ఈ కేసులో పారదర్శక విచారణను ప్రోత్సహిస్తామని తెలిపింది. ఇక ఇప్పటికే జర్మనీ అధికార ప్రతినిధి కూడా అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ పై మాట్లాడారు.ఆయన వ్యాఖ్యలను మన విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+