Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Arvind Kejriwal: బెయిల్ కోసం కేజ్రీవాల్ పాట్లు, జైల్లో అవి తింటున్నారట!!

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలతో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ కోసం పడరాని పాట్లు పడుతున్నాడు. అంతేకాదు తినకూడనివి అన్నీ తింటున్నారు. తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కోర్టుకు అరవింద్ కేజ్రీవాల్ కు సంబంధించి ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. ఇంతకు ఏం జరిగిందంటే..

కోర్టులో కేజ్రీవాల్ పిటీషన్.. నేడు విచారణ
అరవింద్ కేజ్రీవాల్ డయాబెటిస్ పేషెంట్ కావడంతో ఆయన చక్కెర స్థాయిలో హెచ్చుతగ్గులు ఉన్న నేపథ్యంలో తన రెగ్యులర్ డాక్టర్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంప్రదించేందుకు అనుమతించాలని కోరుతూ ఇటీవల ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ పిటిషన్ పై నేడు విచారణ జరిపిన ప్రత్యేక కోర్టుకు ఈడి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పైన సంచలన ఆరోపణలు చేసింది.

Arvind Kejriwal plan for bail eating mangoes and sweets in jail

కేజ్రీవాల్ ఫుల్ గా ఇవి తింటున్నారు: ఈడీ
కేజ్రీవాల్ అభ్యర్థనను వ్యతిరేకించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇంటి భోజనానికి కేజ్రీవాల్ కు అనుమతి ఉండడంతో ఆయన తనకు ఇష్టమైన ఆహారపదార్థాలను తింటున్నారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. డయాబెటిస్ పేషెంట్ అయినప్పటికీ చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండే అరటిపండు, మామిడి పండ్లు , స్వీట్లు, ఆలూ పూరి వంటివి తింటున్నారని, షుగర్ లెవెల్స్ పెరిగే ఆహారాన్ని ఆయన ఉద్దేశపూర్వకంగా తింటున్నారని, కేజ్రీవాల్ బెయిల్ కోసం ఇదంతా చేస్తున్నారని ఈడి ఆరోపించింది.

కేజ్రీవాల్ షుగర్ లెవల్స్ హై..
జైల్లో కేజ్రీవాల్ కు రోజుకు రెండుసార్లు షుగర్ లెవెల్స్ చెక్ చేస్తున్నారని ఈడి వెల్లడించింది. ఏప్రిల్ 1వ తేదీన అరెస్టు చేసిన నాటి నుండి ఇప్పటివరకు జైల్లో ఆయన షుగర్ లెవెల్స్ రెట్టింపు అయ్యాయని ఈడి కోర్టు దృష్టికి తీసుకు వెళ్ళింది. ఇక ఈడీ వాదనతో ఏకీభవించని కేజ్రీవాల్ తరపు న్యాయవాది ఈడీ ఆరోపణలను ఖండించారు.

ఈడీ ఆరోపణలను ఖండించిన కేజ్రీవాల్ న్యాయవాది, కోర్టు ఏమందంటే
కేజ్రీవాల్ కు ఇంటి భోజనం రాకుండా చేయడానికి ఈ డి ప్రయత్నం చేస్తుందని అందుకే కుట్రపూరితమైన ఆరోపణలు చేస్తున్నారని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ధర్మాసనం అరవింద్ కేజ్రీవాల్ కు సంబంధించిన భోజనంతో పాటు, డైట్ చార్ట్ పై శుక్రవారం లోపు నివేదిక ఇవ్వాలని తీహార్ జైలు అధికారులను ఆదేశించారు . దీనిపై తదుపరి విచారణను రేపటికి వాయిదా వేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+