రెబల్ ఎమ్మెల్యే బిన్నీని బహిష్కరించిన కేజ్రీవాల్ పార్టీ

ఎఎపి ప్రకటన ప్రకారం... ఎఎపి క్రమశిక్షణ కమిటీ, పార్టీ బిన్నీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. పార్టీ పైన, పార్టీ నాయకత్వం పైన అవాస్తవ ఆరోపణలు చేశారని ప్రకటనలో పేర్కొన్నారు.
తనను పార్టీ నుండి బహిష్కరించడంపై బిన్నీ స్పందించారు. ఢిల్లీ సమస్యల పైన తాను మాట్లాడానని, అలాంటప్పుడు వారు తనను పార్టీ నుండి తొలగించడం కంటే మించి ఏమీ చేయలేరని విమర్శించారు.
కాగా, కేజ్రీవాల్ పైన ఆ పార్టీకే చెందిన శాసన సభ్యుడు వినోద్ కుమార్ బిన్నీ జనవరి 16న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అప్పుడు బిన్నీ మాట్లాడారు. ఆ ప్రభుత్వం చెప్పేదొకటి.. చేసేదొకటి అని ధ్వజమెత్తారు. ఎవరినో ఎమ్మెల్యేలుగానే, పార్లమెంటు సభ్యులుగానో చేసేందుకు ఎఎపి పుట్టుకు రాలేదన్నారు. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో భాగంగా ఈ పార్టీ ఏర్పాటయిందని గుర్తు చేసారు.
విద్యుత్, తాగునీటికి సంబంధించిన హామీలను పూర్తిగా అమలు చేయలేకపోయిందని ఆయన విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎఎపి ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందన్నారు. కేజ్రీవాల్ చెప్పేది ఒకటి.. చేసేది ఒకటిగా ఉందన్నారు. హామీల అమలును కేజ్రీవాల్ పట్టించుకునే పరిస్థితులు కనిపించడం లేదన్నారు. హామీల అమలులో ఆయన వెనుకడుగు వేస్తున్నారని, మేనిఫెస్టోలో అమలు కాని హామీలు ఉన్నాయన్నారు. డెన్మార్క్ మహిళ అత్యాచార ఘటనపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదో చెప్పాలని నిలదీశారు.












Click it and Unblock the Notifications