• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కేజ్రీ అంచనే నిజమైంది : మోడీ టీంలో ’షా‘ పోర్టుఫోలియోపై ముందేకూశారు ..

|

న్యూఢిల్లీ : కొన్ని సార్లు అంచనాలు నిజమవుతుంటాయి. ముఖ్యంగా ఎన్నికల్లో గెలుపు, ఓటములు గురించి చెప్పే అంశాలు రుజువవుతాయి. అయితే మరికొన్నిసార్లు బొక్కా బొర్లా పడే అవకాశం ఉంది. కానీ ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన అంచనా మాత్రం కచ్చితంగా నిజమైంది. సరిగ్గా వారం రోజుల ముందు లెక్కగట్టి చెప్పిన విషయం రుజువైంది. ఇంతకీ ఆయన ఏం చెప్పాడో ఓ సారి తెలుసుకుందాం.

కేజ్రీనోట హోం మాట ..

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుకు వారం ముందు కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. ఆయన రాజకీయ విమర్శో, నేతలపై సెటైర్లు వేయలేదు. ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధిస్తే మోడీ నేతృత్వంలోని ప్రభుత్వంలో అమిత్ షా హోంమంత్రి పదవీ చేపడుతారని తెలిపారు. ఆయన చెప్పినట్టే జరిగింది. నిన్న రాష్ట్రపతి భవన్‌లో ఈశ్వర్ కే శపత్ లేత హూ అంటు ప్రమాణం చేసిన షా .. ను ఇవాళ హోం బెర్త్ వరించింది. చాణక్యుడు అమిత్ షా కీలకమైన హోం మంత్రి పదవీ కట్టబెట్టారు నరేంద్ర మోడీ. అంతకుముందు ఈ పదవీని సమర్థంగా నిర్వహించిన రాజ్ నాథ్ సింగ్‌కు మరో కీలకమైన రక్షణశాఖ పదవీ అప్పగించారు. రక్షణశాఖ బాధ్యతలు నిర్వహించిన నిర్మలా సీతారామన్‌కు ... ఆర్థికశాఖ బాధ్యతలు అప్పగించారు మోడీ.

Arvind Kejriwals prediction comes true, Amit Shah to head home ministry

విమర్శల జడివాన

అంతకుముందు ఎన్నికల ముందు ఎన్డీఏ సర్కార్‌పై కేజ్రీవాల్ విమర్శల జడివాన కురిపించారు. ఈ ఎన్నికల్లో మోడీకి ఓటేయద్దని బహిరంగంగానే కోరారు. ఒకవేళ మీరు బీజేపీకి ఓటేస్తే ప్రమాదమని హెచ్చరించారు. మోడీ తిరిగి అధికారంలోకి వస్తే హోంమంత్రిగా అమిత్ షా బాధ్యతలు చేపడుతారు. ఓ నేరప్రభావం ఉన్న అమిత్ షా పాలన ఎలా ఉంటుందో మీరు ఊహించండి అని వరుసగా ట్వీట్లు చేశారు. మీరు ఓటేసే ముందుకు ఒకసారి ఆలోచించాలని కోరారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే షా .. హోంమంత్రి పదవీ చేపడుతారనే కేజ్రీవాల్ అంచనా నిజమైంది.

అంతేకాదు మాజీ ముఖ్య ఆర్థికశాఖ సలహాదారు అరవింద్ విర్మనీ, లేదంటే మాజీ ఆర్బీఐ గవర్నర్ బిమల్ జలాన్‌ను ఆర్థికమంత్రి పదవీ చేపడుతారని లెక్కగట్టారు. కానీ ఈ విసయంలో కేజ్రీవాల్ అంచనా తప్పింది. కానీ అమిత్ షా విషయంలో మాత్రం తప్పలేదు. తూ.చ తప్పకుండా కేజ్రీ చెప్పినట్టే కీలకమైన హోంమంత్రి పదవీ చేపట్టారు. నిన్న ప్రమాణ స్వీకారానికి హాజరైన కేజ్రీవాల్ .. మోడీ-షా ద్వయానికి అభినందనలు కూడా తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ చరిత్ర సృష్టించేందుకు వీరిద్దరూ కారణమని కొనియాడారు. ఎన్నికల ఫలితాల తర్వాత కేజ్రీవాల్ స్వరం మారడంతో .. ఆయన ఎన్డీఏ వైపు అడుగులు వేస్తున్నారా అనే అనుమానం కలుగుతుంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
on May 4, Delhi Chief Minister Arvind Kejriwal had tweeted that if the Narendra Modi government returned to power then Bharatiya Janata Party (BJP) president Amit Shah would become the home minister. On Friday, Narendra Modi appointed Amit Shah as his home minister. A few weeks back, in a series of tweets, Arvind Kejriwal asked Indians to think seriously before voting voicing fears for India's future if Amit Shah became the home minister. "Please think about that before voting," he had tweeted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more