పంజాబ్ వీడదీస్తా.. ఖలిస్థాన్‌కు ప్రధాని అవుతా.. కేజ్రీవాల్ అన్నారట: కుమార్ విశ్వాస్ సంచలనం

పంజాబ్ ఎన్నికల వేళ ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్ హాట్ కామెంట్స్ చేశారు. అదీ కూడా అరవింద్ కేజ్రీవాల్ గురించి చేసిన కామెంట్స్ చర్చకు దారితీసింది. ఏదో ఒక రోజు పంజాబ్‌కు సీఎం అవుతానని, లేదంటే పంజాబ్ విడదీసి ప్రత్యేక ఖలిస్థాన్ దేశానికి ప్రధాని అవుతానని కేజ్రీవాల్ గతంలో తనతో అన్నాడని కుమార్ విశ్వాస్ అన్నారు. ఏఎన్ఐ ప్రతినిధికి బుధవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో కుమార్ విశ్వాస్ కామెంట్స్ చేశారు. ఇదీ పెను దుమారం రేపింది.

4 రోజుల్లో ఎన్నికలు ఉండగా..

4 రోజుల్లో ఎన్నికలు ఉండగా..


నాలుగు రోజుల్లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. 117 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుంది. అక్కడ ఆప్ బలంగా కనిపిస్తోంది. కుమార్ విశ్వాస్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కుమార్ విశ్వాస్ మాట్లాడిన వీడియోను బీజేపీ నేత అమిత్ మాళవియా సోషల్ మీడియాలో షేర్ కూడా చేశారు. ఆప్ పంజాబ్ లో అధికారంలోకి వస్తే ఇది ఎంతో ప్రమాదకరం అని అమిత్ మాళవియా అన్నారు.

దేశంపై కుట్రలు

దేశంపై కుట్రలు

దేశంపై కుట్రలు పన్నే ఇలాంటి నేతలను ఎన్నుకోవద్దంటూ ప్రజలకు సూచించారు. గతంలో పంజాబ్ ఎన్నికల పోటీ విషయమై ఒకరోజు అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుకున్నాం అని చెప్పారు. పంజాబ్ రాష్ట్రాన్ని విడదీసే శక్తులైన ఖలిస్థాన్ వాదులతో సంబంధాలపై ఆయన్ను హెచ్చరించానని.. దానికి ఆయన ఇలా అన్నాడని చెప్పారు.

కవితలు రాస్తూ..

కవితలు రాస్తూ..

ఆప్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన కుమార్ విశ్వాస్ ఢిల్లీలో ప్రజాధారణ పొందిన నాయకుడిగా గుర్తింపు పొందారు. కొన్ని రోజుల్లో పార్టీలోని అంతర్గత కుమ్ములాటలతో విసుగుచెందాడు. పార్టీ నుంచి బయటకు వచ్చేశాడు. ప్రస్తుతం కవితలు రాస్తున్నాడు. ప్రస్తుత రాజకీయాలపై స్పందించారు. కుమార్ విశ్వాస్ వ్యాఖ్యలపై అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుమార్ మాట్లాడిన వీడియోలను ప్రసారం చేయవద్దని మీడియా ఛానెళ్లను హెచ్చరించారు. దీంతో కేజ్రీవాల్ చేసిన కామెంట్స్ నిజమేనా అనే సందేహాం కలుగుతుంది. రాష్ట్రంలో ఆప్ మరింత బలపడుతుంది. ఈ క్రమంలో విశ్వాస్ చేసిన కామెంట్స్.. ఆ పార్టీకి నెగటివి కానున్నాయి. మరీ దీనిని కేజ్రీవాల్ ఏ విధంగా లీడ్ చేస్తారో చూడాలీ మరీ.

పంజాబ్ పోల్

పంజాబ్ పోల్

పంజాబ్ లో మొత్తం 117 అసెంబ్లీ సీట్లున్నాయి. ఫిబ్రవరి 20న పోలింగ్ జరగనుంది. తొలుత 14వ తేదీ నిర్వహిస్తామని షెడ్యూల్‌లో ఈసీ తెలిపింది. కానీ రాజకీయ పార్టీల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. దీంతో 20వ తేదీన నిర్వహిస్తామని ఈసీ ప్రకటన చేసింది. మార్చి 10న ఫలితాలు రానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+