సామాన్య జీవితానికే మొగ్గు, కొత్త ఇంట్లో ఏసీలు తొలగించండి: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సామాన్యుడి జీవితాన్నే ఇష్టపడతారు. తాను సాధారణ వ్యక్తినే అని చాటుకునే క్రమంలో, కొత్త నివాసంలో అన్ని ఏసీలు తొలగించాలని స్పష్టం చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ మరికొన్ని రోజుల్లో సివిల్ లైన్స్ ఏరియాలోని నెంబర్ 6, ఫ్లాగ్ స్టాఫ్ రోడ్‌లోని నూతన భవనంలోకి వెళ్ళనున్నారు. ఈ నేపథ్యంలో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌కు తన నిర్ణయాన్ని తెలిపారు.
అయితే ఐదు బెడ్ రూంలకు భవనానికి ఏసీలు తీసివేస్తే ఆ స్ధానంలో పెద్ద ఖాళీలు ఏర్పడతాయని అధికారులు భావిస్తున్నారు. ఆ ఖాళీల స్ధానంలో కిటికీలు ఏర్పాటు చేస్తే సరిపోతుందని సీఎంఓ అధికారులు, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌కు తెలిపారు.

దీనికి బదులుగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఏసీలను ఉపయోగించకుండా ఉంటే సరిపోతుందని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లోని అధికారులు వారి నిర్ణయాన్ని తెలిపినట్లు తెలుస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ఈ ఇంటిలోకి త్వరలో వెళ్లనున్నారు.
ఐదు బెడ్ రూమ్‌లు కలిగిన ఈ ఇంట్లో మూడు ఎటాచ్డ్ బాత్ రూమ్‌లు ఉన్నాయి. ఇంటి ముందు భాగంలో రెండు లాన్లు, రెండు సర్వెంట్ క్వార్టర్లు ఉన్నాయి. ఆఫీసు ఏరియాతో పాటు బంగ్లా వైశాల్యం మొత్తం 5,000 స్క్వేర్ మీటర్లు. ఒక్కసారిగా 40 మందికి సౌకర్య వంతంగా ఉంటుంది. గతంలో ఈ ఇంటిలో విధాన సభ డిప్యూటీ సెక్రటరీకి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ కేటాయించింది.












Click it and Unblock the Notifications