
పంజాబ్ మంత్రులకు కేజ్రివాల్ హెచ్చరిక-సీఎం మాన్ టార్గెట్లు-అందుకోలేకపోతే ఇంటికే..
పంజాబ్ లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్ పై ప్రజల్లో ఉన్న అంచనాలు అందుకునే దిశగా ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ ముందునుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పంజాబ్ మంత్రులతో పాటు సీఎం భగవంత్ మాన్ కూ ఆయన కొన్ని టార్గెట్లు పెట్టారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోకుండా ఉండటం కోసం భగవంత్ మాన్ కూడా మంత్రులకు కొన్ని టార్గెట్లు పెట్టారు. వాటిని అందుకోవడంలో విఫలమైతే ఉద్వాసన తప్పదని ఇవాళ అరవింద్ కేజ్రివాల్ మంత్రులకు హెచ్చరికలు జారీ చేశారు.
पंजाब के CM सरदार @BhagwantMann जी ने @AAPPunjab के विधायकों से मुलाक़ात कर उन्हें संबोधित किया।
— AAP (@AamAadmiParty) March 20, 2022
दिल्ली के CM व AAP राष्ट्रीय संयोजक श्री @ArvindKejriwal जी ने भी Video Conferencing के माध्यम से MLAs को संबोधित कर दिन-रात जनता के लिए काम करने को लेकर प्रोत्साहित किया। pic.twitter.com/BN7kj40jz6
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తన క్యాబినెట్‌లోని ప్రతి మంత్రికి లక్ష్యాలను నిర్దేశించారని, అది నెరవేరకపోతే, ప్రజలు ఆ మంత్రిని తొలగించాలని డిమాండ్ చేయవచ్చని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. భగవంత్ మాన్ మూడు రోజుల్లోనే చాలా అంశాల్ని కవర్ చేశారని కేజ్రివాల్ ప్రశంసించారు. కొత్త ప్రభుత్వ ప్రకటనలను కేజివాల్ ప్రస్తావించారు. భగవంత్ మాన్ పాత మంత్రుల భద్రతను తొలగించి ప్రజలకు భద్రత కల్పించారని కేజ్రివాల్ గుర్తుచేశారు. వృథాగా పోయిన పంటలకు పరిహారం అందించారని, అవినీతి నిరోధక హెల్ప్ లైన్‌ను ప్రకటించారని కేజ్రివాల్ తెలిపారు.

భగవంత్ మాన్ సీఎంగా బాధ్యతలు చేపట్టగానే వివిధ ప్రభుత్వ విభాగాల్లో 25 వేల పోస్టుల భర్తీకి ప్రకటన చేశారు. ఇందులో 10 వేల పోలీసు ఉద్యోగాలు కూడా ఉన్నాయి. మరోవైపు మొహాలీలో సమావేశమైన తమ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ప్రసంగించిన కేజ్రివాల్.. చండీగఢ్‌లో కూర్చోకూడదని, వారు గుర్రపు కోచ్‌లకు అలవాటు పడతారని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే ప్రజల్లో తిరుగుతుంటాడని, గ్రామాలకు వెళ్లాలన్నదే పార్టీ మంత్రమని కేజ్రివాల్ వారికి గుర్తుచేశారు. ఎమ్మెల్యేలు సమయపాలన పాటించాలని, తమ నియోజకవర్గంలోని ప్రతి పట్టణంలో కార్యాలయాన్ని తెరవాలని, రోజుకు 18 గంటలు పని చేయాలని మాన్ కూడా వారికి తెలిపారు.