Arvind Kejriwal: కేజ్రివాల్ ను అరెస్టు చేస్తే జైలు నుంచే పాలన-ఆప్ సంచలన ప్రకటన..
ఢిల్లీ మద్యం స్కాంలో ఇప్పటికే ఢిల్లీ డిప్యూటీ సీఎంగా ఉన్న మనీష్ సిసోడియా సహా పలువురు ఆప్ నేతల్ని సీబీఐ, ఈడీ అరెస్టులు చేసింది. ఇప్పుడు ఏకంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ వంతు కూడా వచ్చేస్తోంది. ఇప్పటికే ఈడీ సమన్లు జారీ చేసినా విచారణకు కేజ్రివాల్ హాజరు కాకపోవడంతో దర్యాప్తు సంస్ధ ఆయన్ను అరెస్టు చేయబోతోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన సొంత పార్టీ ఆప్ స్పందించింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన పక్షంలో జైలు నుంచే పని చేసేందుకు కోర్టు అనుమతి కోరనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన ప్రకటన చేసింది. ఈ రోజు జరిగిన సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు కేజ్రీవాల్‌ను కేంద్ర ఏజెన్సీ అరెస్టు చేసినా, జైలు నుండి ప్రభుత్వాన్ని నడపాలని సూచించారు. ''ప్రజల మధ్యకు వెళ్తున్నాం.. ఆమ్ ఆద్మీ పార్టీపై, అరవింద్ కేజ్రీవాల్‌పై దౌర్జన్యాలు జరుగుతున్నాయని ప్రజలు అంటున్నారు.. అందుకే ఆయన జైలుకు వెళ్లినా.. అలాగే ఉండాలని ఎమ్మెల్యేలంతా ఈరోజు ముఖ్యమంత్రిని అభ్యర్థించారని వారు తెలిపారు.

ఢిల్లీ ప్రజలు ఆయనను సీఎంగా ఎన్నుకున్నారు, ఆయనే సీఎంగా ఉండాలి అని ఢిల్లీ మంత్రి అతిషి తెలిపారు. జైలులోనే క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించేందుకు కోర్టుకు వెళ్లి అనుమతి తీసుకుంటామని మంత్రి అతిషి తెలిపారు. నవంబర్ 2న మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేజ్రీవాల్‌ను విచారణకు పిలిపించింది. అయితే ఆయన ప్రశ్నలను దాటవేసి ఆయనను త్వరలో అరెస్టు చేస్తారని జోస్యం చెప్పారు. ఇంతకుముందు ఆయనను సీబీఐ ఇదే కేసులో ప్రశ్నించింది.












Click it and Unblock the Notifications