వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు: మూడోసారి ఎన్సీబీ విచారణకు అనన్య పాండే డుమ్మా; కారణమిదే !!

|
Google Oneindia TeluguNews

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ రోజు మూడవ సారి విచారణకు హాజరు కావాల్సి ఉన్నా విచారణకు హాజరు కాలేదని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వర్గాలు వెల్లడించాయి. అక్టోబర్ 25వ తేదీన విచారణకు హాజరు కావాల్సిన అనన్య పాండే తన వ్యక్తిగత కారణాల వల్ల మరో రోజు విచారణకు హాజరవుతానని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ను కోరినట్లుగా ఎన్సీబీ వర్గాలు వెల్లడించాయి.

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు: సెల్ఫ్ డిఫెన్స్ లో సమీర్ వాంఖడే; తనపై కుట్ర అంటూ ముంబై పోలీసులకు ఫిర్యాదుఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు: సెల్ఫ్ డిఫెన్స్ లో సమీర్ వాంఖడే; తనపై కుట్ర అంటూ ముంబై పోలీసులకు ఫిర్యాదు

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అనన్య పాండే విచారణ

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అనన్య పాండే విచారణ

షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో పట్టుబడిన తర్వాత ఆర్యన్ ఖాన్ మొబైల్ వాట్సప్ చాటింగ్ ఆధారంగా అనన్య పాండే ఇంటి పై దాడి చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు గత గురు, శుక్రవారాలలో అనన్య పాండేను విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసి విచారణ జరిపారు. శుక్రవారం రోజు విచారణ జరిపిన నార్కోటిక్స్ అధికారులు అనన్య పాండే నుండి పలు వివరాలను సేకరించే ప్రయత్నం చేశారు. ఆర్యన్ ఖాన్ తో ఎప్పటి నుంచి పరిచయం అని మొదలు పెట్టిన డ్రగ్స్ నిరోధక సంస్థ అధికారులు ఆర్యన్ ఖాన్ తో చేసిన డ్రగ్స్ చాట్ గురించి పదేపదే అనన్య పాండేను ప్రశ్నించినట్టు సమాచారం.

నేడు ఎన్సీబీ విచారణకు అనన్య పాండే డుమ్మా ... రీజన్ ఇదే

నేడు ఎన్సీబీ విచారణకు అనన్య పాండే డుమ్మా ... రీజన్ ఇదే

అయితే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు అనన్య పాండే సరైన సమాచారం ఇవ్వకపోవడంతో మళ్లీ సోమవారం నాడు విచారణకు హాజరు కావలసిందిగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అనన్య పాండే కు నోటీసులిచ్చింది.

అయితే ఈ రోజు విచారణకు హాజరు కావాల్సి ఉన్నా అనన్య పాండే వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోతున్నానని
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇచ్చిన సమన్‌లకు ఆమె సమాధానంలో పేర్కొంది. మరేదైనా రోజు తాను విచారణకు హాజరవుతానని పాండే తదుపరి తేదీ ఇవ్వాలని అధికారులను కోరింది. అనన్య పాండే వ్యక్తిగత కారణాల వల్ల సమయం కోరింది," అని ఏజెన్సీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అశోక్ ముఠా జైన్ అన్నారు.

ఇప్పటికి రెండు సార్లు అనన్య పాండే విచారణ

ఇప్పటికి రెండు సార్లు అనన్య పాండే విచారణ

మళ్లీ త్వరలో విచారణకు హాజరు కావాలని ఆమెకు మరో సమన్ జారీ చేయనుంది

ఎన్‌సిబి . 22 ఏళ్ల అనన్య పాండేను మూడవ సారి విచారణ కోసం రావాలని నోటీసులు ఇచ్చింది. అంతకుముందు శుక్రవారం నాలుగు గంటలు, గురువారం రెండు గంటలపాటు ఆమెను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారించారు. ఆర్యన్ ఖాన్ మొబైల్ నుంచి రికవరీ అయిన చాట్స్ ఆధారంగా ఆమెకు సమన్లు ​​జారీ అయ్యాయి. గురువారం ఆమెను ప్రశ్నించిన సమయంలో ఆమె డ్రగ్స్ సరఫరా , వినియోగం ఆరోపణలను ఖండించింది.
రెండవ సారి విచారణ కోసం వచ్చినప్పుడు, పాండేను ఆలస్యంగా వచ్చినందుకు ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే మందలించారు.

రెండో సారి విచారణలో అనన్య పాండేను మందలించిన సమీర్ వాంఖడే

రెండో సారి విచారణలో అనన్య పాండేను మందలించిన సమీర్ వాంఖడే

కొనసాగుతున్న క్రూయిజ్ డ్రగ్స్ కేసులో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఎన్‌సిబి విచారణకు అనన్య పాండే రావాల్సిందిగా ఎన్సీబీ నోటీసులిస్తే, తన తండ్రి నటుడు చంకీ పాండేతో కలిసి మధ్యాహ్నం 2 గంటల తర్వాత నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణకు హాజరైన అనన్య పాండేను వాంఖడే విచారణ సంస్థ కార్యాలయం "ప్రొడక్షన్ హౌస్" కాదని, ఇష్టమొచ్చినట్టు రావడానికి అంటూ మందలించారు.

అక్టోబర్ 2 న కార్డెలియా క్రూయిజ్ షిప్‌లో ఎన్‌సిబి బృందం డ్రగ్స్ పార్టీని అరెస్టు చేసింది. అక్టోబర్ 2 న డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ పట్టుబడ్డాడు, అనేకసార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నా కానీ అతని పిటిషన్లన్నీ తిరస్కరించబడ్డాయి. అతను మొదట నాలుగు రోజుల పాటు ఎన్‌సిబి కస్టడీకి పంపబడ్డాడు. ఆ తర్వాత జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నాడు. ఆర్యన్ ఖాన్ తో పాటు అతని స్నేహితులు అర్బాజ్ మర్చంట్ మరియు మున్మున్ ధమేచాలు సైతం ముంబై ఆర్థర్ రోడ్ జైలులో ఉన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎన్‌సీబీ 20 మందిని అరెస్టు చేసింది.

English summary
NCB sources said that Ananya Pandey was scheduled to appear for the third time today in the Aryan Khan drugs case but did not appear for the trial. The NCB said it had asked him to appear for trial another day for personal reasons.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X