వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కీలక సాక్షి, చీటింగ్ కేసులో లుకౌట్ నోటీసులు ఇచ్చిన కిరణ్ గోసావి అరెస్ట్

|
Google Oneindia TeluguNews

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో వివాదాస్పద విట్నెస్ గా ఉన్న కిరణ్ గోసావి చుట్టూ కేసు తిరుగుతుంది. సమీర్ వాంఖడే కి లంచం ఇవ్వాలని ప్రయత్నం చేసినట్టు కిరణ్ గోసావి అంగరక్షకుడు అఫిడవిట్ ఇవ్వటంతో కేసులో కిరణ్ గోసావి పాత్ర కీలకంగా మారింది. తాను పోలీస్ స్టేషన్లో లొంగిపోతానని ప్రకటించిన తర్వాత తాజాగా కిరణ్ గోసావిని పూణేలో అరెస్ట్ చేశారు.

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కీలక సాక్షి కిరణ్ గోసావి అరెస్ట్

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కీలక సాక్షి కిరణ్ గోసావి అరెస్ట్

ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసును దర్యాప్తు చేస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ ఏజెన్సీ యొక్క వివాదాస్పద "స్వతంత్ర సాక్షి" కిరణ్ గోసావి ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని పోలీస్ స్టేషన్‌లో లొంగిపోతానని పేర్కొన్న మూడు రోజుల తర్వాత పూణేలో అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగం ఇప్పిస్తానని యువతను మోసం చేసి వారి వద్ద నుండి డబ్బులు వసూలు చేసిన చీటింగ్ కేసుకు సంబంధించి లుకౌట్ నోటీసు జారీ చేశారు మహారాష్ట్ర పోలీసులు. కిరణ్ గోసావి, మహారాష్ట్రలో తన ప్రాణాలకు హాని ఉందని, తనను బెదిరిస్తున్నారని పేర్కొని, ఉత్తరప్రదేశ్ పోలీసులకు లొంగిపోవాలనుకుంటున్నట్లు చెప్పాడు.

ఆర్యన్ ఖాన్ కు సన్నిహితంగా ప్రైవేట్ డిటెక్టివ్ కిరణ్ గోసావి ఫోటోలు, వీడియోలు వైరల్

ఆర్యన్ ఖాన్ కు సన్నిహితంగా ప్రైవేట్ డిటెక్టివ్ కిరణ్ గోసావి ఫోటోలు, వీడియోలు వైరల్


కే పి గోసావి తమకు లొంగిపోవడానికి ప్రయత్నిస్తున్నారనే వాదనలను లక్నో పోలీసులు తర్వాత తోసిపుచ్చారు. అలాంటిదేమీ లేదని చెప్పారు. ఒక ప్రైవేట్ డిటెక్టివ్ గోసావి ఈ నెల ప్రారంభంలో ముంబై క్రూయిజ్ షిప్ రైడ్ సమయంలో , ఆ తరువాత నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కార్యాలయంలో ఆర్యన్ ఖాన్‌తో కలిసి ఉన్నారు. రెండు ప్రదేశాలలో ఆర్యన్ ఖాన్‌తో అతని సెల్ఫీ మరియు వీడియోలు షారుఖ్ ఖాన్ కుమారుడికి అతను సన్నిహితంగా ఉన్నట్టు తేల్చింది.

కిరణ్ గోసావికి , ఆర్యన్ ఖాన్ కు, ఎన్సీబీకి లింక్ ఏంటి ?మహా ప్రభుత్వం ధ్వజం

కిరణ్ గోసావికి , ఆర్యన్ ఖాన్ కు, ఎన్సీబీకి లింక్ ఏంటి ?మహా ప్రభుత్వం ధ్వజం


ఇది యాంటీ డ్రగ్స్ ఏజెన్సీ దర్యాప్తుపై మహారాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రశ్నలకు ఆజ్యం పోసింది. ముంబై క్రూయిజ్ షిప్ దాడిలో, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కార్యాలయంలో స్వతంత్ర సాక్షి ఎందుకు హాజరు కావాలి. ఈ కేసులో కీలక నిందితులతో సెల్ఫీలు ఎందుకు తీసుకోవాలని పలువురు నాయకులు ప్రశ్నించారు. ఆ తర్వాత కిరణ్ గోసావి చేతిలో ఉన్న ఫోన్ లో ఆర్యన్ ఖాన్ మాట్లాడిన వీడియో కూడా బయటకు రావటంతో దీనిపై సమగ్ర దర్యాప్తు చెయ్యాలని మహారాష్ట్ర మంత్రులు డిమాండ్ చేశారు.

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో సాక్షి ప్రభాకర్ సెయిల్ అఫిడవిట్ లో షాకింగ్ విషయాలు

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో సాక్షి ప్రభాకర్ సెయిల్ అఫిడవిట్ లో షాకింగ్ విషయాలు

గత ఆదివారం, కేపీ గోసావి వ్యక్తిగత అంగరక్షకుడిగా పనిచేసే ప్రభాకర్ సెయిల్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారించిన క్రమంలో ప్రభాకర్ సెయిల్ ఆర్యన్ ఖాన్ ను కేసు నుండి తప్పించటం కోసం కే పి గోసావి డీల్ మాట్లాడారని , సామ్ డిసౌజాతో చెల్లింపుల గురించి గోసావి టెలిఫోనిక్ సంభాషణను విన్నానని చెప్పాడు. వారు రూ. 25 కోట్ల బాంబు వేశారని, ఆపై రూ. 18 కోట్లతో డీల్ సెటిల్‌ చేయాలని గోసావి చెప్పినట్లు తాను విన్నానని, ఇందులో రూ. 8 కోట్లు ఎన్‌సిబికి చెందిన జోనల్ అధికారి ఇన్‌ఛార్జ్‌గా ఉన్న సమీర్ వాంఖడేకి అని మాట్లాడినట్లుగా ప్రభాకర్ సెయిల్ పేర్కొన్నాడు.

ఆర్యన్ ను కేసు నుండి తప్పించటానికి ఎన్సీబీతో కిరణ్ గోసావి డీల్ .. ఖండించిన గోసావి

ఆర్యన్ ను కేసు నుండి తప్పించటానికి ఎన్సీబీతో కిరణ్ గోసావి డీల్ .. ఖండించిన గోసావి

అయితే తాజాగా పోలీసులకు లొంగిపోతానని చెప్పిన క్రమంలో కిరణ్ గోసావి దీని గురించి తనకు ఏమీ తెలీదని చెప్పారు. అక్టోబర్ 2కి ముందు తాను సమీర్ వాంఖడేని కలవలేదని, తాను దీన్ని మొదటిసారిగా వింటున్నాను అని చెప్పాడు. ఇక ఈ కేసులో కీలకంగా ఉన్న కిరణ్ గోసావిని పట్టుకోవడంతో, కిరణ్ గోసావి ఇచ్చే సమాచారం ఆర్యన్ ఖాన్ అడ్రస్ కేసును ఏ మలుపు తిప్పుతుందో అన్నది తెలియాల్సి ఉంది.

ఇక మరోపక్క ఎన్సీబీ లంచం ఆరోపణలపై విజిలెన్స్ దర్యాప్తు కొనసాగుతుంది. నిన్నటి ముంబై చేరుకున్న ఎన్సీబీ విజిలెన్స్ దర్యాప్తు ఐదుగురు సభ్యుల బృందం విచారణ ప్రారంభించింది. ఈ బృందం లంచం వ్యవహారంలో కీలకంగా ఉన్న కిరణ్ గోసావిని కూడా విచారణ జరపనుంది.

English summary
Kiran Gosavi, a controversial "independent witness" of aryan khan drugs case, was arrested in Pune three days after he said about his surrender at a police station in Lucknow, the capital of Uttar Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X