వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్యన్ ఖాన్ కేసులో షాకింగ్ ట్విస్ట్: లంచం డీల్ జరిగింది; సమీర్ వాంఖడే పాత్రపై సామ్ డిసౌజా సంచలనం

|
Google Oneindia TeluguNews

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆర్యన్ ఖాన్ ను కేసు నుండి తప్పించడం కోసం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులతో డీల్ జరిగిందని, సమీర్ వాంఖడే కు ఎనిమిది కోట్లు డబ్బులు చెల్లించాలని చర్చ జరిగిందని కేపీ గోసావి బాడీగార్డ్ ప్రభాకర్ సెయిల్ ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో అఫిడవిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ డీల్ మాట్లాడిన వారిలో కేపీ గోసావి, మధ్యవర్తిగా వ్యవహరించిన సామ్ డిసౌజా, షారుక్ ఖాన్ మేనేజర్ పూజ దడ్లానీ ఉన్నారని ప్రభాకర్ సెయిల్ పేర్కొన్నారు. దీంతో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జోనల్ డైరెక్టర్ గా సమీర్ వాంఖడే ఆరోపణలపై ఎన్సీబీ విజిలెన్స్ విచారణ ఎదుర్కొంటున్నారు.

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కీలక సాక్షి, చీటింగ్ కేసులో లుకౌట్ నోటీసులు ఇచ్చిన కిరణ్ గోసావి అరెస్ట్ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కీలక సాక్షి, చీటింగ్ కేసులో లుకౌట్ నోటీసులు ఇచ్చిన కిరణ్ గోసావి అరెస్ట్

లంచం డీల్ లో సమీర్ వాంఖడే పాత్ర లేదన్న సామ్ డిసౌజా... గోసావిపై ఆరోపణ

లంచం డీల్ లో సమీర్ వాంఖడే పాత్ర లేదన్న సామ్ డిసౌజా... గోసావిపై ఆరోపణ


ఇక ఇదే సమయంలో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ను కేసు నుంచి తప్పించే డీల్ లో మధ్యవర్తిగా వ్యవహరించిన సామ్ డిసౌజా, ఈ డీల్ లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే పాత్ర లేదని వెల్లడించారు. గోసావి అతనితో టచ్‌లో ఉన్నట్లు మాత్రమే నటించాడని అన్నారు. అతను "మోసగాడు" అని తెలుసుకున్న తర్వాత గోసావి ఆ డబ్బు తిరిగి ఇచ్చేలా చేసానని డిసౌజా పేర్కొన్నాడు. షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజ దడ్లానీతో తాను ఎలాంటి ఒప్పందంలో భాగం కాలేదని వాంఖడే గతంలోనే కొట్టిపారేశాడు. గత వారం పూణెలో చీటింగ్ కేసులో గోసావి అరెస్టయ్యాడు.

గోసావి దడ్లానీ నుండి 50 లక్షలు తీసుకున్నాడని చెప్పిన డిసౌజా

గోసావి దడ్లానీ నుండి 50 లక్షలు తీసుకున్నాడని చెప్పిన డిసౌజా

డిసౌజా తాను అక్టోబర్ 3 తెల్లవారుజామున దడ్లానీ మరియు గోసావి మధ్య ఒక ఒప్పందానికి మధ్యవర్తిత్వం చేయడానికి సమావేశాన్ని ఏర్పాటు చేశానని చెప్పాడు. దడ్లానీ, ఆమె భర్త, గోసావి, తాను మరికొందరు అక్టోబర్ 3 వ తేదీన ఉదయం 4 గంటలకు లోయర్ పరేల్‌లో కలుసుకున్నామని చెప్పాడు. తాను కాసేపు అక్కడి నుండి బయటకు వెళ్లానని, ఆర్యన్‌ ఖాన్ ను కేసు నుండి తప్పించడం కోసం గోసావి దడ్లానీ నుండి రూ. 50 లక్షలు తీసుకున్నాడని తర్వాత తెలిసిందని పేర్కొన్నారు.

 సమీర్ సర్ అంటూ ఫేక్ కాల్ చేసిన గోసావి.. డబ్బులు తిరిగిచ్చేలా డిసౌజా ఒత్తిడి

సమీర్ సర్ అంటూ ఫేక్ కాల్ చేసిన గోసావి.. డబ్బులు తిరిగిచ్చేలా డిసౌజా ఒత్తిడి


లోయర్ పరేల్‌లోని రెండెజౌస్‌లో గోసావి ఫోన్ మోగిందని, "సమీర్ సర్" అని ఉన్న కాలర్ ఐడిని తనకు చూపించాడని అతను పేర్కొన్నాడు. కానీ, గోసావి ఆ పేరుతో సెయిల్ నంబర్‌ను సేవ్ చేసి, ఒప్పందాన్ని మధ్యవర్తిత్వం చేస్తున్నప్పుడు వాంఖడేతో మాట్లాడుతున్నట్లు ముద్ర వేయడానికి అందరికీ చూపించాడని అతను ఆరోపించాడు. ట్రూకాలర్ యాప్ సెయిల్ నంబర్‌ని చూపించడంతో గోసావి "మోసగాడు" అని తాను తర్వాత గ్రహించానని డిసౌజా చెప్పారు. "అతను సమీర్ వాంఖడేతో మాట్లాడుతున్నట్లు నటించాడని నేను గ్రహించాను" అని దీంతో డీల్ జరిగిన కొన్ని గంటల్లోనే గోసావిపై ఒత్తిడి తెచ్చి డబ్బు తిరిగి వచ్చేలా చూశానని ఆయన పేర్కొన్నారు.

లంచం డీల్ లో కొత్త పేర్లు .. సునీల్ పాటిల్ డిసౌజా మధ్య డ్రగ్స్ పార్టీ చర్చ

లంచం డీల్ లో కొత్త పేర్లు .. సునీల్ పాటిల్ డిసౌజా మధ్య డ్రగ్స్ పార్టీ చర్చ


ఈ డీల్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని డిసౌజా చెప్పారు. "పవర్ బ్రోకర్"గా చెప్పే సునీల్ పాటిల్ నుండి అక్టోబరు 1న తనకు కాల్ వచ్చిందని పేర్కొన్నాడు. మరుసటి రోజు కార్డెలియాలో పార్టీ గురించి కొన్ని ముఖ్యమైన సమాచారం ఉందని పాటిల్ డిసౌజాతో చెప్పారు. "తనను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కు కనెక్ట్ చేయమని పాటిల్ నన్ను అడిగాడు. అందుకే గోసావికి ఫోన్ చేసి ఇద్దరినీ పరిచయం చేశానని డిసౌజా తెలిపారు.డిసౌజా ప్రకారం, ఆర్యన్ అరెస్టు తర్వాత, ఆర్యన్ దడ్లానీతో మాట్లాడాలనుకుంటున్నాడని చెప్పడానికి గోసావి అతనికి ఫోన్ చేశాడు. ఆర్యన్ దగ్గర ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని, తాను ఈ కేసులో సహాయం చేయగలనని గోసావి అతనికి చెప్పాడు. కొంతమంది స్నేహితుల ద్వారా దడ్లానీతో పరిచయం ఏర్పడిందని డిసౌజా పేర్కొన్నారు.

డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ ను తప్పించడానికి డీల్ జరిగిందన్న డిసౌజా

డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ ను తప్పించడానికి డీల్ జరిగిందన్న డిసౌజా


నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తో డిసౌజా సంబంధాలు, అతను డ్రగ్స్ పెడ్లర్ అని ఆరోపణల గురించి డిసౌజా తనకు అలాంటి రికార్డు లేదని తాను ఒక వ్యాపారవేత్త అని చెప్పారు. గతంలో మాదక ద్రవ్యాల గురించి సమాచారం వచ్చినప్పుడల్లా ఎన్‌సీబీ అధికారులకు చేరవేసినట్లు తెలిపారు. మొత్తానికి సామ్ డిసౌజా చెప్పిన అంశాలను బట్టి డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ ను తప్పించడానికి డీల్ జరిగిందని ప్రభాకర్ సెయిల్ చెప్పిన విషయాలలో వాస్తవం ఉందని అర్థమవుతుంది. మరి ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఏంటి అనేది ఎన్సీబీ విజిలెన్స్ విచారణలో తేలనుంది.

 డ్రగ్స్ కేసులో ప్రభాకర్ సెయిల్ చేసిన వ్యాఖ్యలతో దుమారం

డ్రగ్స్ కేసులో ప్రభాకర్ సెయిల్ చేసిన వ్యాఖ్యలతో దుమారం


గత నెలలో డ్రగ్స్‌ కేసులో సాక్షిగా ఉన్న ప్రభాకర్‌ సెయిల్‌, గోసావి అంగరక్షకుడిగా పనిచేశాడని, డిసౌజాతో ఫోన్‌లో మాట్లాడడం విన్నానని, కేసు నుంచి తప్పించే డీల్ మాట్లాడుతున్న క్రమంలో డిసౌజా పేరు బయటకు వచ్చిందని పేర్కొన్నారు. దడ్లానీతో రూ. 25 కోట్లకు డీల్ మాట్లాడారని, దానిని 18 కోట్లకు ఫైనల్ చేశారని, రూ. 8 కోట్లు వాంఖడేకు ఇస్తామని చర్చించగా విన్నానని ప్రభాకర్ సెయిల్ పేర్కొన్నాడు. అప్పటి నుండి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డ్రగ్స్ ఆరోపణలను ఎదుర్కొంటుంది. ఇది నిజమేనా అని బాలీవుడ్ వర్గాలలో చర్చ జరిగింది. ఇక తాజాగా డిసౌజా చేసిన వ్యాఖ్యలతో లంచం డీల్ జరిగిందని అర్ధం అవుతుంది.

English summary
Sam D'Souza, who acted as mediator in the deal to keep Shahrukh Khan's son Aryan Khan out of the case, has revealed that Sameer Wankhede, the zonal director NCB, has no role in the deal. Gosavi only pretended to be in touch with NCB.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X