Aryan Khan: షారుక్ ఖాన్ కొడుకు దేశముదురు, ఎన్ సీబీ పంచనామాలో పటాపంచలు, షూలో డ్రగ్స్ !

ముంబాయి/ గోవా/ బెంగళూరు: బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కుమారుడు అర్యన్ ఖాన్ కు సినిమా కచ్చితంగా కనపడుతుందని సమాచారం. ఎన్ సీబీ అధికారుల జరిపిన పంచనామాలో షారుక్ ఖాన్ కొడకు ఆర్యన్ ఖాన్ తాను డ్రగ్స్ సేవించినట్లు అంగీకరించాడని వెలుగు చూసింది. అర్యన్ ఖాన్ స్నేహితుడు అర్బాజ్ మర్చంట్ అతని దగ్గర ఉన్న నిషేధిత డ్రగ్స్ ను స్వయంగా ఎన్ సీబీ అధికారులకు అప్పగించాడని సమాచారం. ముంబాయి తీరంలో కార్డెలియా క్రూయిజ్ లైనర్ లో ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్ తదితరులు గ్రాండ్ గా లిక్కర్ పార్టీ జరుపుకుని అక్కడ డ్రగ్స్ సేవించారని ఎన్ సీబీ అధికారుల పంచనామాలో వెలుగు చూసింది.

 ఎంజాయ్ చేస్తుంటే ఎన్ సీబీ ఎంట్రీ

ఎంజాయ్ చేస్తుంటే ఎన్ సీబీ ఎంట్రీ

ముంబాయి తీరంలోని కార్డెలియా క్రూయిజ్ లైనర్ మీద ఎన్ సీబీ అధికారులు దాడులు చేసిన సమయంలో ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్ ఒకే చోట ఉన్నారని ఎన్ సీబీ అధికారి రాజన్ ప్రసాద్ అంటున్నారు. ఆ సమయంలో క్రూయిజ్ లో ఉన్న వారు గ్రాండ్ గా లిక్కర్ పార్టీ చేసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తున్నారని ఎన్ సీబీ అధికారులు అంటున్నారు.

 గుడ్ బాయ్..... డ్రగ్స్ ఇచ్చేశాడు

గుడ్ బాయ్..... డ్రగ్స్ ఇచ్చేశాడు

బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్ ను ఎన్ సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో మీ దగ్గర ఏమైనా డ్రగ్స్ ఉన్నాయా ? అంటూ ఎన్ సీబీ అధికారులు ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్ ను ప్రశ్నించారు. ఆ సమయంలో నా దగ్గర డ్రగ్స్ ఉన్నాయని అర్బాజ్ మర్చంట్ అంగీకరించాడని ఎన్ సీబీ అధికారుల పంచమనాలో స్పష్టం చేశారు.

 షారుక్ ఖాన్ కొడుకు ఫ్రెండ్ షూలో డ్రగ్స్ ప్యాకెట్ !

షారుక్ ఖాన్ కొడుకు ఫ్రెండ్ షూలో డ్రగ్స్ ప్యాకెట్ !

అర్బాజ్ మర్చంట్ తన షూ లోపల డ్రగ్స్ దాచిపెట్టాడని అంగీకరించాడని ఎన్ సీబీ అధికారులు పంచనామాలో తెలిపారు. అర్బాజ్ మర్చంట్ స్వయంగా అతని షూ లోపల బ్లాక్, స్టిక్కీ పదార్థం ఉన్న జిప్ లాక్ బ్యాగ్ ను ఎన్ సీబీ అధికారులకు ఇచ్చేశాడు. ఆ పదార్థాలను డీడీ కిట్ తో పరీక్షించి అది చరాస్ అని నిర్దారించమని ఎన్ సీబీ అధికారుల పంచనామాలో చెప్పారు.

 నేరం అంగీకరించిన షారుక్ కొడుకు !

నేరం అంగీకరించిన షారుక్ కొడుకు !

ఆర్యన్ ఖాన్ బెస్ట్ ఫ్రెండ్ అర్బాజ్ మర్చంట్ నుంచి ఆరు గ్రాముల చరాస్ ను స్వాధీనం చేసుకున్నామని ఎన్ సీబీ అధికారుల పంచనామాలో స్పష్టం చేశారు. ఎన్ సీబీ అధికారుల విచారణలో షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ తాను డ్రగ్స్ సేవించానని అంగీకరించాడని, ఆ విషయం ఎన్ సీబీ అధికారుల పంచనామాలో వెలుగు చూసిందని ఇండియా టుడే మీడియా కథనం వెలువరించింది.

 షారుక్ ఖాన్ కొడుకు దేశముదురు !

షారుక్ ఖాన్ కొడుకు దేశముదురు !

ముంబాయి తీరం నుంచి గోవాకు వెలుతున్న క్రూయిజ్ షిప్ లో షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ తో పాటు అతని స్నేహితులు డ్రగ్స్ పార్టీ జరుపుకుంటున్నారని ఎన్ సీబీ అధికారులకు పక్కా సమచారం అందండంతో దాడి చేశారు. అర్యన్ ఖాన్, అర్బాజ్ ఖాన్, ఇష్మీత్ సింగ్, విక్రాంత్ కొచ్చర్ తో పాటు మొత్తం 8 మందిని ఎన్ సీబీ అధికారులు అరెస్టు చేశారు. తాను డ్రగ్స్ సేవించలేదని మొదట సినిమా స్టోరీ చెప్పిన ఆర్యన్ ఖాన్ తరువాత డ్రగ్స్ సేవించాడని అంగీకరించాడని ఎన్ సీబీ అధికారుల పంచమనాలో అంగీకరించాడని ఇండియా టుడే మీడియా కథనం ప్రచురించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+