వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హస్తినలో కరోనా కేసుల తగ్గుముఖం.. ఆస్పత్రుల్లో బెడ్లు కూడా ఖాళీ

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ కేసులు పెరగడమే కానీ తగ్గడం అంటూ ఉండటం లేదు. ముంబై, ఢిల్లీ గురించి అయితే చెప్పక్కర్లేదు. అయితే ఢిల్లీలో ఫస్ట్ టైమ్ కరోనా కేసుల తగ్గుముఖం కనిపించింది. అలాగే ఆస్పత్రిలో బెడ్లు అందుబాటులో ఉన్నాయనే విషయం తెలిసింది. పడకలే కాదు, ఐసీయూలో బెడ్లు కూడా ఉన్నాయనే సమాచారం తెలిసింది.

 As Covid Graph Declines, Vacant Hospital Beds Increase In Delhi

మొత్తం 14 వేల 805 బెడ్లలో 12 వేల 907 అందుబాటులోకి వచ్చాయి. గత కొన్నిరోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది. మంగళవారం ఇక్కడ 4482 కరోనా కేసులు వచ్చాయి. ఏప్రిల్ 5వ తేదీ తర్వాత ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే తొలిసారి. 265 మంది మాత్రమే చనిపోయారు. కరోనా కేసుల పాజిటివ్ శాతం కూడా 6.89 శాతం వరకు తగ్గిపోయింది.

ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులలో బెడ్లు ఖాళీగా ఉన్నాయని అధికారులు తెలిపారు. రికవరీ రేటు కూడా బాగా పెరిగిందని చెప్పారు. మంగళవారం 94.37 శాతం రికవరీ కనిపించిందని చెప్పారు. ఒక్కరోజులో 9403 మంది కోలుకున్నారు. ఇక్కడ 50 వేల 863 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

English summary
declining number of daily COVID-19 cases in Delhi has resulted in increase in the number of vacant beds and intensive care units in the city's hospitals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X