కరోనా మరింత ప్రమాదకరంగా..: కేంద్రమంత్రి హర్షవర్ధన్ వార్నింగ్, చేయాల్సినవి, చేయకూడనివివే..
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా మరోసారి కరోనా కేసులు పెరుగుతుండటంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రజలు కరోనా నిబంధనలు పాటించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, దీంతోనే వైరస్ వ్యాప్తి పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వ్యాఖ్యానించారు. ఇది ఇలాగే కొనసాగితే దేశంలో రానున్న రోజులు మరింత ప్రమాదకరమని హెచ్చరించారు.
Recommended Video

జాగ్రత్తలు పాటించినప్పుడే కరోనా కట్టడంటూ హర్షవర్ధన్
దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులపై ఉన్నతాధికారులతో ఆదివారం సమావేశం నిర్వహించిన సందర్భంగా కేంద్రమంత్రి హర్షవర్ధన్ మాట్లాడారు. ఇప్పటికైనా ప్రజలు కరోనా మహమ్మారి పట్ల అప్రమత్తై కరోనా కట్టడికి సహకరించాలని కోరారు. ప్రజలు పూర్తిస్థాయిలో మాస్కులు ధరించడం లేదని, కొందరు మాస్కును మెడ భాగానికి, జేబుకే పరిమితం చేస్తున్నారని, దీని వల్లే వైరస్ వ్యాప్తి చెందుతోందని అన్నారు. కరోనాపై ప్రాథమిక జాగ్రత్తలు పాటించినప్పుడే వైరస్‌ను కట్టడి చేయగలమని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.

కరోనా పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి..
ప్రస్తుతం దేశంలో కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా సాగుతోందన్నారు. దేశంలో అందుబాటులో ఉన్న రెండు టీకాలను తీసుకోవాలన్నారు. రానున్న రోజుల్లో వ్యాక్సినేషన్ మరింత వేగవంతం చేస్తామని హర్షవర్ధన్ తెలిపారు. మహారాష్ట్రతోపాటు కరోనా కేసులు పెరుగుతున్న రాష్ట్రాలు పంజాబ్, మధ్యప్రదేశ్, తమిళనాడు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. కాగా, గత 24గంటల్లో దేశ వ్యాప్తంగా 43,846 కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. ఇది గత నాలుగునెలల్లో అత్యధికం. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో గత బుధవారం ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం పలు కీలక సూచనలు చేసింది.

కరోనాను అరికట్టేందుకు చేయాల్సిన పనులు:
వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి. కనీసం 20 సెకన్ల పాటు మీ చేతులను సబ్బుతో కడగాలి.
ఇంటి బయట ఉన్నప్పుడు, యాంటీ బాక్టీరియల్ హ్యాండ్ శానిటైజర్‌ను క్రమం తప్పకుండా ఉపయోగించాలి.
మీ ఇళ్ళ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఎల్లప్పుడూ ఫేస్ మాస్క్ ధరించండి. ఎల్లప్పుడూ.
దగ్గు లేదా తుమ్ము ఉన్నప్పుడు ఎల్లప్పుడూ మీ నోటిని మోచేయి/టిష్యూ లేదా రుమాలుతో అడ్డుపెట్టుకోండి.
బయట ఉన్నప్పుడు, దగ్గు వచ్చినా మాస్కును తీయకూడదు.
ఉపయోగించిన టిష్యూను వెంటనే చెత్తబుట్టలో పారేయాలి.
పీపీఈ కిట్లు, ఫేస్ మాస్క్‌లు, గ్లోవ్స్‌తో సహా రక్షిత వస్తువులను ఉపయోగించిన తర్వాత సురక్షితంగా నాశనం చేయాలి.
బహిరంగ ప్రదేశాల్లో ఇతరులతో ఆరు అడుగుల దూరంలో ఉండేలా చూసుకోవాలి.
వీలైతే ఇంటి నుంచే పనిచేసే పద్ధతిని ఎంచుకోండి.
ఆరోగ్యం బాగాలేదనుకుంటే ఇంట్లోనే ఉండండి. జ్వరంతోపాటు దగ్గు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది ఎదురైతే వెంటనే వైద్యులను సంప్రదించండి.

కరోనా కట్టడి చేయాలంటే.. మనం చేయకూడనివి:
మీ ముఖాన్ని, ముఖ్యంగా మీ కళ్ళు, ముక్కు, నోటిని వీలైనంత వరకు తాకడం మానుకోండి.
సామాజిక దూరాన్ని నిర్వహించడం కష్టంగా ఉన్న మాల్స్, జిమ్‌లు, రెస్టారెంట్లు, పబ్బులను సందర్శించడం మానేయండి.
నగరాలు, రాష్ట్రాలు లేదా దేశం అంతటా అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండండి.
జన సంచారం ఉన్న బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయవద్దు.

ప్రభుత్వ కార్యాలయాల్లో..
ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కేంద్రం కరోనా జాగ్రత్తలను సూచించింది. కార్యాలయ భవనాల్లో థర్మల్ స్కానర్స్ ఏర్పాటు, భవనాల శానిటైజేషన్ లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది. అనారోగ్యంతో ఉన్నవారిని వెంటనే ఆస్పత్రికి తరలించాలని స్పష్టం చేసింది. అనవసర సందర్శకులను పూర్తిగా తగ్గించాలని తెలిపింది. సమావేశాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే నిర్వహించుకోవాలని సూచించింది. అవసరం లేని ప్రయాణాలు వద్దని తెలిపింది. అనవసర కార్యక్రమాలు, కార్యకలాపాలు పూర్తిగా నివారించాలని స్పష్టం చేసింది. కార్యాలయాలు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పేర్కొంది. హ్యాండ్ శానిటైజర్లు ఉపయోగించాలని, వాష్ రూంలలో నీటి సరఫరా ఎప్పుడూ ఉండేలా చూసుకోవాలని తెలిపింది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications