
యోగిని కొడతాం, అసదుద్దీన్-అఖిలేశ్ పొత్తు వట్టిదే: ఎంఐఎం క్లారిటీ -110 సీట్లలో ముస్లింల ఆధిపత్యం
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం, కేంద్రంలో అధికారానికి దగ్గరి దారిగా భావించే ఉత్తరప్రదేశ్ లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఇంకొద్ది నెలల్లో జరగోయే అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య సమీకరణలు, కొత్త పొత్తులు ఉంటాయని, యూపీలో పాగా కోసం ఎదురుచూస్తోన్న అసదుద్దీన్ ఓవైసీ.. అఖిలేశ్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకోబోతున్నదని వార్తలు వచ్చాయి. కాగా, సదరు వార్తలను ఖండిస్తూ, ఎంఐఎం క్లారిటీ ఇచ్చింది..
షాక్:సీబీఐ జేడీ చేసింది చాలా తక్కువ -జగన్ లూటీలు అన్నీ మోదీకి చెప్పేస్తా -ఎంపీ రఘురామ రియాక్షన్
యూపీ ముఖ్యమంత్రిగా అసదుద్దీన్ ఓవైసీ -బీఎస్ఎంతో కలిసి 100 సీట్లలో -యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు

ముస్లింకు డిప్యూటీ సీఎం ఇస్తే..
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సమాజ్‌వాది పార్టీతో ఎంఐఎం షరతులతో కూడిన పొత్తు పెట్టుకునేందుకు చర్చలు చేసిందని, రాష్ట్రంలో సమాజ్‌వాది ప్రభుత్వం ఏర్పడితే ముస్లిం నేతకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఎంఐఎం కండిషన్ పెట్టిందని, ఆగస్టు మొదటి వారంలో అసదుద్దీన్ ఓవైసీపీ యూపీలో పర్యటించి, సదరు పొత్తును ఫైనలైజ్ చేస్తారని గడిచిన కొద్ది గంటలుగా జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు ప్రసారం అయ్యాయి. అయితే సదరు రిపోర్టులన్నీ అవాస్తవాలని, ఎస్పీతో పొత్తు వట్టిదేనని మజ్లిస్ నేతలు స్పష్టం చేశారు.

యోగిని ఢీకొడతాం కానీ..
రాబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ముఖమైన సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కచ్చితంగా ఢీకొట్టి తీరుతామని, అయితే, సమాజ్ వాదీ పార్టీతో పొత్తు మాత్రం వట్టిదేనని మజ్లిస్ పార్టీ యూపీ విభాగం అధ్యక్షుడు షౌకత్ అలీ అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ''యూపీలో ఒకవేళ సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వస్తే ముస్లిం నాయకుడిని ఉప ముఖ్యమంత్రి చేస్తే పొత్తుకు ఎంఐఎం ఓకే చెప్పిందన్న వార్తలు నిజం కాదు. నేనుగానీ, మా అధినేత అసదుద్దీన్ ఓవైసీగానీ యూపీతో పొత్తుపై ఎలాంటి ప్రకటన చేయలేదు. గత ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ 20 శాతం ముస్లిం ఓట్లను పొందిందని, అయినప్పటికీ ముస్లిం నాయకుడిని ఉప ముఖ్యమంత్రిగా చేయలేదని మాత్రమే విమర్శించాం. ఆ వ్యాఖ్యలను మీడియా వక్రీకరించింది'' అని షౌకత్ అలీ వివరించారు. కాగా,
Recommended Video

యూపీలో 110 స్థానాల్లో ముస్లింలు..
హైదరాబాద్ వెలుపల మహారాష్ట్రలో రెండు ఎంపీ సీట్లు, ఎమ్మెల్యేల గెలుపుతో మొదలైన మజ్లిస్ విస్తరణ.. గతేడాది బీహార్ ఎన్నికల్లో ఐదు సీట్లతో గెలుపుతో మరింత బలపడింది. పశ్చిమ బెంగాల్లో పరాభవం ఎదుర్కొన్నా, రాబోయే యూపీ అసెంబ్లీలో సత్తా చాటాలని భావిస్తోన్న అసదుద్దీన్ ఇప్పటికే భాగీదారి సంకల్ప్ మోర్చా(బీఎస్ఎం)అనే కూటమి ద్వారా 9 స్థానిక పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. యూపీలో మొత్తం 404 సీట్లుండగా, 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు 30 నుంచి 39 శాతం దాకా ఉన్నారు. 44 అసెంబ్లీ సెగ్మెంట్లలో ముస్లింలు 40 నుంచి 49 శాతంగా, అదే 11స్థానాల్లో 50 నుంచి 65 శాతంగా ముస్లిం ఓటర్లు ఉన్నారు. బీఎస్ఎం కూటమితో పొత్తులో భాగంగా మజ్లిస్ పార్టీ ఈసారి 100 సీట్లలో పోటీకి దిగుతున్నది.