లొంగిపోయిన ఆశిష్ మిశ్ర - బెయిల్ రద్దు : సుప్రీం ఆదేశం-జైలుకు..!!
లఖింపుర్ ఖేరీ ఘటన నిందితుడు..కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్ర లొంగిపోయారు. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేయడం వల్ల ఆయన లఖింపుర్ జిల్లా కోర్టుకు వెళ్లి సరెండర్ అయ్యారు. లొంగిపోవటానికి న్యాయస్థానం వారం రోజుల సమయం నిర్దేశించింది. అయితే, ఒక రోజు ముందుగానే ధర్మాసనం ఎదుట సరెండర్ అయ్యారు. నిందితుడు ఆశిష్ మిశ్రాకు భద్రతా కారణాల వల్ల జైలులో ప్రత్యేక గదిని కేటాయించినట్లు జైలు అధికారులు తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్ లఖింపుర్ ఖేరీలో ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన నేపథ్యంలో గతేడాది అక్టోబర్‌లో ఆ ప్రాంతంలో హింస చెలరేగింది.
లఖింపుర్ ఖేరీ జిల్లా టికునియా- బన్బీర్‌పుర్ సరిహద్దు వద్ద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న రైతులు, అధికార వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర కుమారుడు ఆశిష్ మిశ్ర కారుతో నలుగురు రైతులను ఢీకొట్టారు. ఈ ఘటనలో జరిగిన హింసతో నలుగురు రైతులు సహా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి ఆశిష్ మిశ్ర ప్రధాన నిందితుడుగా ఉన్నారు. దీంతో..దేశ వ్యాప్తంగా ఈ ఘటన సంచనలానికి కారణమైంది. రాజకీయంగానూ బీజేపీ పైన ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి.

కేంద్ర మంత్రి పైన చర్యలకు డిమాండ్ చేసాయి. కేసులో అశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు ఫిబ్రవరి 10న బెయిల్ మంజూరు చేయగా.. ఆ తర్వాత బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. గత సోమవారం ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ధర్మాసనం బెయిల్‌ను రద్దు చేస్తూ ఈ నెల 18న ఉత్తర్వులు జారీ చేసింది.దానిని రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. కోర్టు ఆదేశాల మేరకు ఆశిష్ మిశ్ర లొంగిపోయారు.












Click it and Unblock the Notifications