• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జైపూర్ టు జైసల్మీర్: ప్రత్యేక విమానంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల తరలింపు, 17వ తేదీన బలపరీక్ష..?

|

రాజస్తాన్ రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. అశోక్ గెహ్లట్ వర్సెస్ సచిన్ పైలట్ ఆధిపత్య పోరు కొనసాగుతున్నాయి. గెహ్లట్‌పై తిరుగుబాటు ఎగరేసిన పైలట్.. తన వర్గ 18 మంది ఎమ్మెల్యేలతో హర్యానాలో మకాం వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గెహ్లట్ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను జైపూర్‌లోని ఓ హోటల్‌లో ఉంచారు. అయితే అసెంబ్లీ నిర్వహించేందుకు ఎట్టకేలకు గవర్నర్ కల్ రాజ్ మిశ్రా అనుమతివ్వడంతో.. పింక్ సిటీలో నంబర్ గేమ్ మొదలైంది. రాజస్తాన్ అసెంబ్లీలో 200 సభ్యులు ఉండగా.. గెహ్లట్ ప్రభుత్వం గట్టెక్కాలంటే 102 మంది సభ్యుల మద్దతు తప్పనిసరి. అయితే ఇప్పటివరకు కూడా తమకు పూర్తి మెజార్టీ ఉంది అని గెహ్లట్ చెప్పడం కాస్త ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

రాజస్తాన్ రాజకీయ సంక్షోభంలో కీలక పరిణామం... గవర్నర్ నుంచి గెహ్లాట్‌కు గ్రీన్ సిగ్నల్...

14 నుంచి సభ పర్వం..

14 నుంచి సభ పర్వం..

ఆగస్ట్ 14వ తేదీ నుంచి అసెంబ్లీ ప్రత్యక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో జైపూర్ కాక మరో సిటీకి ఎమ్మెల్యేలను తీసుకెళ్లాలని గెహ్లట్ భావిస్తున్నారు. జై సల్మేర్ అయితే బాగుంటుందని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. 100 మంది వరకు ఎమ్మెల్యేలను ప్రత్యేక విమానంలో ఇవాళ తరలిస్తారని తెలుస్తోంది. బలపరీక్ష సమయం సమీపిస్తోన్న వేళ. బేరసారాలు పెరుగుతోన్న క్రమంలో దూరం తరలించే వ్యుహాం రచించారు.

బేరసారాలు..

బేరసారాలు..

గత కొద్దీరోజుల నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారని.. పైలట్, బీజేపీపై గెహ్లట్ విమర్శలు చేస్తున్నారు. ఆ ఆరోపణలను మరింత ఎక్కువ చేశారు. తొలుత రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్లు ఉన్న బేరసారాలు రెట్టింపు అయ్యాయని గెహ్లట్ ఆరోపించారు. బల నిరూపణ కోసం అసెంబ్లీని సమావేశపరచాలని గెహ్లట్.. మూడుసార్లు గవర్నర్‌ కల్ రాజ్ మిశ్రాను కోరిన కరోనా పేరుతో అంగీకరించలేదు. చివరికీ నాలుగోసారి మంత్రివర్గ సమావేశం నోట్ పంపించడంతో.. సెషన్ నిర్వహించేందుకు అంగీకారం తెలిపారు. 21 నుంచి 31 రోజుల్లో బలం నిరూపించుకోవాలని గెహ్లట్‌ను గవర్నర్ కోరారు.

  Audio Tapes కలకలం... Congress దూకుడు, రెబల్‌ ఎమ్మెల్యేల కు Show Cause Notices, BJP వ్యూహం ?
  18 నుంచి 30 ఎమ్మెల్యేలు.. అనర్హత వేటు

  18 నుంచి 30 ఎమ్మెల్యేలు.. అనర్హత వేటు

  రెబల్ ఎమ్మెల్యేలు దాదాపు 30 మంది వరకు ఉంటారనే భావన వ్యక్తమవుతోంది. కానీ పైలట్ పక్షాన 18 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇలా ఉండగా హైకోర్టు గెహ్లట్ సర్కార్ షాక్ ఇచ్చింది. కాంగ్రెస్‌లో విలీనమైన బీఎస్పీ ఆరుగురు సభ్యులపై నోటీసులు ఇచ్చింది. సభకు తిరుగుబాటు సభ్యులు హాజరవుతామని చెప్పగా.. విప్ ధిక్కరించినందుకు అనర్హత వేటు వేస్తారు. దీంతో అసెంబ్లీలో బలబలాల లెక్కలపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఆగస్ట్ 17వ తేదీన బలపరీక్ష నిర్వహించేందుకు గెహ్లట్ సర్కార్ అడుగులు వేస్తోందని విశ్వసనీయంగా తెలిసింది.

  English summary
  100 Rajasthan Congress MLAs, who have been staying at a hotel near Jaipur are likely to be moved to Jaisalmer by special flight today
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more