అశోక్ గెహ్లాట్ సంచలన నిర్ణయం: సోనియా గాంధీకి క్షమాపణలు, రాజస్థాన్ సంక్షోభం ఎఫెక్ట్
న్యూఢిల్లీ: రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ గురువారం సంచలన ప్రకటన చేశారు. తాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. రాజస్థాన్ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలోనే అశోక్ గెహ్లాట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తన తాజా నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి క్షమాపణలు చెబుతున్నట్లు అశోక్ గెహ్లాట్ తెలిపారు. అంతేగాక, రాహుల్ గాంధీని తాను కొచ్చిలో కలిశానని, అప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ కొనసాగాలని కోరానని చెప్పారు. ఆయన అందుకు అంగీకరించకపోవడం వల్లే తాను బరిలో దిగానని తెలిపారు.

అయితే, ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు అశోక్ గెహ్లాట్.
I met Rahul Gandhi in Kochi & requested him to fight in the polls (for Congress President). When he didn't accept, I said I'll contest but now with that incident (#RajasthanPoliticalCrisis), I've decided not to contest the elections: Rajasthan CM Ashok Gehlot, in Delhi pic.twitter.com/2VnqTcQUAu
— ANI (@ANI) September 29, 2022
అంతకుముందు జరిగిన పరిణామాలు:
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బరిలో అశోక్ గెహ్లాట్ ఉండటంతో ఆదివారం పార్టీ ఎమ్మెల్యేలతో కీలక భేటీ నిర్వహించింది. అయితే, గెహ్లాట్ మద్దతు దారులు మరో మీటింగ్ నిర్వహించారు. సచిన్ పైలట్‌ను రాజస్థాన్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినప్పటికీ.. గెహ్లాట్ మద్దతుదారులు మాత్రం ఆయనను అంగీకరించడం లేదు. అంతేగాక, పలువురు ఎమ్మెల్యే రాజీనామాలకు కూడా సిద్ధమయ్యారు. కాంగ్రెస్ నేతలు మల్లిఖార్జున ఖర్గే, అజయ్ మాకేన్‌లు ఎమ్మెల్యేలకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది.
ఈ నేపథ్యంలో గెహ్లాట్ మద్దతుదారులైన ముగ్గురు ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే, గెహ్లాట్‌కు మాత్రం వీరు క్లీన్ చిట్ ఇచ్చారు. రాజస్థాన్ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో గెహ్లాట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బరి నుంచి తప్పుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షులు ఎవరైనా వారి నాయకత్వంలో పనిచేస్తామని గెహ్లాట్ తెలిపారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్ కొనసాగనున్నారు.












Click it and Unblock the Notifications