బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బ్లాక్ మెయిల్: నకిలీ సీబీఐ అధికారి అరెస్టు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రభుత్వ అధికారులకు ఫోన్లు చేసి దాడులు చేస్తామని బెదిరించి భారీ మొత్తంలో నగదు వసూలు చెయ్యడానికి ప్రయత్నించిన నకిలీ సీబీఐ అధికారిని బెంగళూరులోని అశోక్ నగర పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

బెంగళూరులోని అనేపాళ్యలో నివాసం ఉంటున్న మహమ్మద్ అబ్బాస్ (21) అనే యువకుడిని అరెస్టు చేశామని మంగళవారం పోలీసు అధికారులు చెప్పారు. పోలీసుల కథనం మేరకు ఇతను సీపీడబ్ల్యూడీ ఇంజనీర్లకు ఫోన్లు చేశాడు.

తాను సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ అని పరిచయం చేసుకున్నాడు. నేను అడిగినంత సొమ్ము ఇవ్వకుంటే మీ నివాసాలు, కార్యాలయాల మీద దాడులు చేస్తానని బెదిరించాడు. బాధిత ఇంజనీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 Ashoknagar police have arrested Syed Mohammed Abbas in Bengaluru

ఇంజనీర్లకు వచ్చిన బెదిరింపు ఫోన్ నెంబర్ గుర్తించి మహమ్మద్ అబ్బాస్ ను అరెస్టు చేశామని పోలీసు అధికారులు తెలిపారు. ఇతను రాళ్ల వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారంలో నష్టం వచ్చింది. ఇటీవల ఉత్తరప్రదేశ్ లో సీపీడబ్ల్యూడీ నివాసాల మీద సీబీఐ అధికారులు దాడులు చేశారు.

తరువాత ఇంజనీర్లు అక్రమంగా సంపాధించిన రూ. కోట్ల విలువైన అక్రమ ఆస్తులు గుర్తించారు. ఈ వీడియో క్లిప్పింగ్స్ యూ ట్యూబ్ లో చూసిన అహమ్మద్ అబ్బాస్ సినిమా ఫక్కిలో ఇంజనీర్లను బెదిరించి నగదు వసూలు చెయ్యడానికి ప్రయత్నించాడని అశోక్ నగర పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు.

English summary
Bengaluru Ashoknagar police have arrested Syed Mohammed Abbas (21) who was posing as a CBI officer and threatening government officials and demanding money.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X