వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆసియా కప్ 2022: భారత్‌పై పాకిస్తాన్ ఎలా గెలిచింది... ఆసిఫ్ అలీ, ఖుష్‌దిల్ షా చివరి రెండు ఓవర్లలో ఏం చేశారు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
పాకిస్తాన్

ఆసియా కప్‌ సూపర్ ఫోర్ మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్‌తో అయిదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. పాకిస్తాన్ ఆటగాళ్లు ఆసిఫ్ అలీ, ఇఫ్తేకర్ అహ్మద్, ఖుష్‌దిల్ షా జట్టును విజయం వైపు నడిపించారు.

పాకిస్తాన్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే చివరి రెండు ఓవర్లలో 26 పరుగులు చేయాల్సి ఉంది. భువనేశ్వర్ కుమార్ వేసిన 19వ ఓవర్లో ఆసిఫ్ అలీ, ఖుష్‌దిల్ షా కలిసి 19 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని ఖరారు చేశారు.

దానికి ముందు, 18వ ఓవర్‌లో భారత బౌలర్ రవి బిష్ణోయ్ వేసిన బంతికి ఆసిఫ్ అలీ సింపుల్ క్యాచ్‌ ఇచ్చాడు. కానీ, అర్ష్‌దీప్ సింగ్ వదిలేశాడు. ఈ క్యాచ్ పట్టి ఉంటే పాకిస్తాన్‌కు 19వ ఓవర్లో 19 పరుగులు చేయడం కష్టమై ఉండేది.

అయితే, చివరి ఓవర్‌లో ఆసిఫ్ అలీని అర్ష్‌దీప్ సింగ్ అవుట్ చేయడంతో మళ్లీ భారత్ ఆశలు చిగురించాయి. కానీ, పాకిస్తాన్ ఛాన్స్ ఇవ్వలేదు. తరువాత బ్యాటింగ్‌కు వచ్చిన ఇఫ్తేకర్ అహ్మద్, ఖుష్‌దిల్ షాకు తోడుగా నిలిచి మ్యాచ్ ముగించాడు.

https://twitter.com/ACCMedia1/status/1566490526941351937

పాకిస్తాన్ బ్యాటింగ్ సాగిందిలా..

181 పరుగుల లక్ష్యంతో పాకిస్తాన్ బరిలోకి దిగింది. ఓపెనర్లుగా మహ్మద్ రిజ్వాన్, బాబర్ అజామ్ పటిష్టంగా కనిపించారు కానీ, బాబర్ అజామ్ 10 బంతులకే వెనుదిరిగాడు. రవి బిష్ణోయ్ వేసిన బంతికి క్యాచ్ ఇచ్చి, పెవిలియన్ బాట పట్టాడు. బాబర్ అజామ్ 10 బంతుల్లో రెండు ఫోర్లతో 14 పరుగులు చేశాడు.

తరువాత వచ్చిన ఫఖర్ జమాన్ కూడా 18 బంతుల్లో 15 పరుగులు చేసి తొందరగానే వెనుదిరిగాడు.

మరో పక్క, రిజ్వాన్ నిలకడగా ఆడుతూ, పరుగులు రాబడుతూనే ఉన్నాడు. టు డౌన్‌లో బ్యాంటింగ్‌కు దిగిన మహ్మద్ నవాజ్, రిజ్వాన్‌కు తోడుగా నిలిచాడు. వీరిద్దరూ కలిసి పాకిస్తాన్ స్కోరును పరుగులు పెట్టించారు.

మహ్మద్ నవాజ్ కేవలం 20 బంతుల్లో 42 పరుగులు (6 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి మ్యాచ్‌ను దాదాపు తమవైపుకు తిప్పుకున్నాడు.

అప్పుడే, భువనేశ్వర్ కుమార్ తన చివరి ఓవర్లో స్లో బాల్ వేసి నవాజ్‌ను పెవిలియన్‌కు పంపాడు.

https://twitter.com/TheRealPCB/status/1566487410464153600

దీని తరువాత హార్దిక్ పాండ్యా, మహ్మద్ రిజ్వాన్‌ను అవుట్ చేశాడు. రిజ్వాన్ 51 బంతుల్లో 71 పరుగులు (6 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి పాకిస్తాన్ స్కోరు నిలబెట్టాడు.

రిజ్వాన్ అవుట్ అయిన తరువాత మ్యాచ్ భారత్ వైపు మొగ్గు చూపినట్టు కనిపించింది. కానీ, తరువాత వచ్చిన బ్యాట్స్‌మన్ విజృంభించి మ్యాచ్ ముగించారు.

ఈ మ్యాచ్‌లో భారత జట్టులో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపించింది. అయితే, రవి బిష్ణోయ్ మెరుగ్గా ఆడాడు. నాలుగు ఓవర్లలో 26 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. హార్దిక్ పాండ్యా నాలుగు ఓవర్లలో 44 పరుగులు, భువనేశ్వర్ కుమార్ నాలుగు ఓవర్లలో 40 పరుగులు ఇచ్చారు. ఇద్దరూ చెరో వికెట్ తీశారు.

భారత్ బ్యాటింగ్

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.

కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మలు బ్యాట్ ఝళిపిస్తే పరుగుల వరదేనని ఈ సూపర్ ఫోర్ మ్యాచ్‌లో మరోసారి రుజువయింది.

నసీమ్ షా వేసిన తొలి ఓవర్లో, రోహిత్ శర్మ ముందు ఫోర్ కొట్టి, చివరి బంతికి సిక్సర్ బాదాడు. మొదటి ఓవర్‌లోనే 11 పరుగులు వచ్చాయి.

రెండో ఓవర్‌లో ఇద్దరూ కలిసి తొమ్మిది పరుగులు జోడించారు. నసీమ్ షా వేసిన మూడో ఓవర్ తొలి, చివరి బంతికి కేఎల్ రాహుల్ సిక్సర్లు బాదాడు. మూడు ఓవర్లకు 34 పరుగులు చేశారు. అయిదు ఓవర్లకు 54 పరుగులు జోడించారు.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ భారీ మూల్యమే చెల్లించుకోవాలసి వస్తుందని విశ్లేషకులు అంచనా వేశారు.

అప్పుడే, హరీస్ రవూఫ్ వేసిన బంతిని పైకి కొట్టే ప్రయత్నంలో రోహిత్ శర్మ క్యాచ్ ఇచ్చాడు. ఖుష్దిల్ షా అద్భుతమైన క్యాచ్ పట్టాడు. దాంతో, రోహిత్ శర్మ 16 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 28 పరుగులు చేసి వెనుదిరిగాడు.

తరువాతి ఓవర్లో షాదాబ్ ఖాన్ తొలి బంతికే కేఎల్ రాహుల్‌ (20 బంతుల్లో 28 పరుగులు)ను పెవిలియన్‌కు పంపాడు.

కోహ్లీ

కోహ్లీ ప్రతాపం..

రెండు వికెట్లు కోల్పోయిన భారత కాస్త తడబడింది. వన్ డౌన్‌లో విరాట్ కోహ్లీ క్రీజులో పాతుకుపోయాడు కానీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ ఎక్కువసేపు నిలబడలేకపోయారు.

సూర్యకుమార్ యాదవ్ 10 బంతుల్లో 13 పరుగులు (రెండు ఫోర్లు), రిషబ్ పంత్ 12 బంతుల్లో 14 పరుగులు (రెండు ఫోర్లు) చేసి వెనుదిరిగారు.

విరాట్ కోహ్లీ చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో తను పూర్తిగా ఫామ్‌లోకి వచ్చేసినట్టు కనిపించింది. 34వ బంతికి సిక్సర్ కొట్టి అద్భుతమైన హాఫ్ సెంచరీ చేశాడు.

మరోవైపు దీపక్ హూడా, కోహ్లీకి గొప్ప మద్దతు ఇచ్చాడు. దీపక్ 14 బంతుల్లో రెండు ఫోర్లతో 16 పరుగులు చేశాడు.

మ్యాచ్ చివరి ఓవర్ నాలుగో బంతికి కోహ్లీ రనౌట్ అయ్యాడు. మొత్తం 44 బంతుల్లో 60 పరుగులు (4 ఫోర్లు, 1 సిక్సర్) చేసి జట్టుకు మంచి స్కోర్ అందించాడు.

చివరి రెండు బంతుల్లో, రవి బిష్ణోయ్ రెండు ఫోర్లు కొట్టి భారత్‌ స్కోరును 181 పరుగులకు చేర్చాడు. పాకిస్తాన్ పేలవమైన ఫీల్డింగ్ కూడా సహకరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Asia Cup 2022: How Pakistan beat India... What did Asif Ali and Khushdil Shah do in the last two overs?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X