వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ జీ.. హిమంతను నమ్మకండి, గతంలో రాహుల్‌ను పొగిడారు, ఇప్పుడు విమర్శలు: కాంగ్రెస్

|
Google Oneindia TeluguNews

పార్టీలు మారితే విమర్శలు సహాజమే.. ఇవాళ ఒక పార్టీలో ఉండి.. రేపు మరో పార్టీలో చేరేవారు చాలా మంది ఉన్నారు. అయితే అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ.. 2015లోనే కాంగ్రెస్ పార్టీ వీడారు. బీజేపీలో చేరి.. ఇప్పుడు అసోం సీఎంగా ఉన్నారు. ఇటీవల రాహుల్ గాంధీని శర్మ కామెంట్ చేశారు. ఓ ఫన్నీ వీడియోను ట్వీట్ చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. గతంలో రాహుల్ గాంీని పొగిడిన ట్వీట్‌ను యాడ్ చేసి.. ప్రధాని మోడీకి ట్వీట్ చేసింది.

గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో ఏదో ఒకరోజు దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని కామెంట్ చేశారు. ఆ ట్వీట్‌ను కాంగ్రెస్ నేత మాణిక్కం ఠాగూర్ రీ ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపడుతున్న క్రమంలో.. బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. హిమంత కూడా అదేవిధంగా విరుచుకుపడుతున్నారు. దీంతో వీడియో ట్వీట్ చేయగా.. గంటల్లోనే ఠాగూర్ ట్వీట్ చేశారు.

2010లో హిమంత రాహుల్ గాంధీని పొగిడారని గుర్తుచేశారు. మోడీ జీ మీరు హిమంతను విశ్వసించకండి అని కోరారు. అతను మిమ్మల్ని కూడా మోసం చేయగలడు అని అన్నారు. కానీ మీరు అతని ట్రాక్‌లో పడరని అనుకుంటున్న అని కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడినప్పటి నుంచి హిమంత శర్మ.. రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల భారత్ జోడో యాత్రను కామెడీ ఆఫ్ ద సెంచరీ అని కామెంట్ చేశారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు కూడా అలాగే స్పందిస్తున్నాయి.

Assam Chief Ministers Rahul Gandhi Cartoon Gets A Counter From 2010

రాహుల్ గాంధీ యాత్ర కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ 150 రోజుల పాటు 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల గుండా సాగనుంది. అయితే నిన్న అతని టీ షర్ట్‌‌పై కూడా వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.

English summary
Congress has dug up a 12-year-old tweet of Assam Chief Minister Himanta Biswa Sarma praising Rahul Gandhi, hours after he posted a parody video mocking him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X