సోనియాకు షాక్: అస్సాం సిఎం గోగోయ్ రాజీనామా
న్యూఢిల్లీ: అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గోగోయ్ రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయన రేపు గురువారం రాజీనామా చేయనున్నారు. లోకసభ ఎన్నికల్లో అస్సాంలో కాంగ్రెసు పార్టీ తగిన ఫలితాలు సాధించడంలో విఫలమైనందుకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. తన రాజీనామా లేఖను ఆయన కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి సమర్పిస్తారు .
సోనియాను కలిసి రాజీనామా లేఖను సమర్పించి, తన భవిష్యత్తను నిర్దేశించాలని కోరడానికి ఆయన మంగళవారంనాడే ఢిల్లీ వచ్చారు. లోకసభ ఎన్నికల్లో ఫలితాలు సాధించడంలో విఫలమైన నేపథ్యంలో గోగోయ్ని మార్చాలనే డిమాండ్ మరోసారి పెచ్చరిల్లింది.

అస్సాంలో కాంగ్రెసు కేవలం మూడు సీట్లను మాత్రమే గెలుచుకుంది. నాయకత్వ మార్పునకు తిరుగుబాటు మంత్రులు, శాసనసభ్యులు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాన్ని ఎదుర్కోవడానికి కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని తరుణ్ గోగోయ్ అనుకూల వర్గం సూచిస్తోంది.
మంత్రుల నుంచి రాజీనామాలు తీసుకుని, కొత్తవారితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని వారంటున్నారు. 2016 శానససభ ఎన్నికలకు ముందే కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని వారంటున్నారు.
-
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం











Click it and Unblock the Notifications