చమురు బావిలో భారీగా ఎగిసిన మంటలు: ముగ్గురు విదేశీ నిపుణులకు గాయాలు

గౌహతి: అస్సాంలోని తిన్సుకియా జిల్లా బాఘ్జన్‌లో ఆయిల్ ఇండియా సంస్థ(ఓఐఎల్) చమురు బావిలో తాజాగా మరోసారి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు విదేశీ నిపుణులు గాయపడినట్లు కంపెనీ సీనియర్ మేనేజర్ జయంత బర్ముడోయి వెల్లడించారు.

కాగా, గత నెల రోజుల నుంచి ఈ బావిలో తరచూ మంటలు ఎగిసిపడుతుండటం గమనార్హం. ఈ మంటలను అదుపులో చేసే క్రమంలోనే ముగ్గురు విదేశీ నిపుణులు గాయపడినట్లు అధికారులు తెలిపారు.

Assam: Huge explosion near Baghjan oil well, 3 foreign experts injured

మే 28 నుంచి ఈ చమురు బావిలో గ్యాస్ లీకవుతోంది. కాగా, జూన్ 9 నుంచి మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఈ మంటలను అదుపులో చేసే ప్రయత్నంలో ఇప్పటికే ఇద్దరు ఫైరింజిన్ సిబ్బంది మరణించారు .

Recommended Video

    Bhutan కూడా India పై కయ్యానికి దిగితే? 70 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా నదీ జలాల అడ్డగింత ఎవరి పని ?

    ఈ క్రమంలో విదేశాల నుంచి నిపుణులను రప్పించి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఈ ప్రయత్నం కూడా తాజా ప్రమాదంతో తాత్కాలికంగా నిలిపివేశారు. గ్యాస్ లీకవడం ,మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో పరిసర ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+