స్కూళ్లకు నాన్-వెజ్ తెస్తే కఠిన చర్యలు.. విద్యాశాఖ సంచలన ఆదేశాలు
అది జూన్ 5వ తేదీ మధ్యాహ్నం. ఎప్పటిలాగే స్కూల్లో లంచ్ బెల్ మోగింది. విద్యార్థులంతా తమ టిఫిన్ బాక్సులు తెరిచారు. కానీ, ఆ క్లాస్‌రూమ్‌లోని ఒక బెంచ్ వద్ద మాత్రం వింత వాతావరణం నెలకొంది. ఒక ముస్లిం మైనర్ విద్యార్థి తెచ్చిన టిఫిన్ బాక్స్ చుట్టూ ఐదుగురు విద్యార్థులు చేరారు. ఆ బాక్స్ తెరుచుకోగానే వచ్చిన వాసన, లోపల ఉన్న పదార్థం చూసి మిగతా ఇద్దరు హిందూ విద్యార్థులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఎందుకంటే.. అందులో ఉంది బహిరంగంగా నిషేధించబడిన 'బీఫ్' (గోమాంసం).
ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. కేవలం వారు తినడమే కాదు.. ఆ ఇద్దరు హిందూ స్నేహితులను కూడా బలవంతంగా ఆ మాంసం తినాలంటూ సదరు విద్యార్థులు ఒత్తిడి చేయడం ప్రారంభించారు. భయంతో వణికిపోయిన ఒక విద్యార్థి ఎలాగోలా వారి నుంచి తప్పించుకుని, క్లాస్‌రూమ్ నుంచి బయటకు పరిగెత్తి ఒక సీనియర్ టీచర్‌కు విషయం చెప్పాడు. కానీ, ఆ ఉపాధ్యాయుడు చేసిన పని ఈ కథను మరో మలుపు తిప్పింది. ఆ తప్పును ఖండించాల్సింది పోయి, గొడవ పెద్దదవుతుందనే భయంతో విషయాన్ని అక్కడికక్కడే నొక్కేయడానికి, దాచడానికి ప్రయత్నించాడు.

రాత్రికి చేరిన వార్త.. ఉదయాన్నే రణరంగం!
సాయంత్రం పిల్లలు ఇంటికి వెళ్లి భయపడుతూనే అసలు విషయం తల్లిదండ్రులకు చెప్పారు. అంతే.. మరుసటి రోజు జూన్ 6వ తేదీ తెల్లవారేసరికి స్కూల్ ఆవరణ ఒక రణరంగంగా మారిపోయింది. ఆగ్రహంతో ఊగిపోతూ పెద్ద సంఖ్యలో వచ్చిన హిందూ విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాన్ని ముట్టడించారు. ఉద్రిక్తత గమనించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగాల్సి వచ్చింది. తల్లిదండ్రుల రాతపూర్వక ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి లోతుగా దర్యాప్తు చేయగా షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి.
అస్సాంలోని గోల్పారా జిల్లా 'హబ్రఘాట్ హైస్కూల్' లో చదువుతున్న ఆ మైనర్ బాలుడికి ఆ బీఫ్ కర్రీ వండి, ఆ టిఫిన్ బాక్స్‌లో పెట్టి పంపింది మరెవరో కాదు.. స్వయంగా అతని తల్లేనని తేలింది. దీంతో జూన్ 7న పోలీసులు ఆ బాలుడిని అదుపులోకి తీసుకోవడమే కాకుండా, అతని తల్లిపై 'అస్సాం పశువుల సంరక్షణ చట్టం, 2021' కింద కేసు నమోదు చేసి అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. గొడవలో ఉన్న మిగిలిన నలుగురు ముస్లిం మైనర్లను కూడా స్టేషన్‌కు తరలించి గంటల తరబడి విచారించారు.
జిల్లా మొత్తం నాన్-వెజ్ బ్యాన్!
ఈ ఒక్క లంచ్ బాక్స్ వివాదం గోల్పారా జిల్లా మొత్తాన్ని కుదిపేయడంతో విద్యాశాఖ అత్యవసరంగా రంగంలోకి దిగింది. ఎలాంటి మతపరమైన ఘర్షణలు జరగకుండా ఉండేందుకు జూన్ 6వ తేదీనే జిల్లా ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ ఒక సంచలన ఉత్తర్వు జారీ చేశారు.
ఆ ఆర్డర్ ప్రకారం.. ఇకపై జిల్లాలోని ఏ ప్రభుత్వ స్కూల్లోనూ విద్యార్థులు తమ టిఫిన్ బాక్సుల్లో 'నాన్-వెజ్' (మాంసాహారం) తీసుకురావడానికి వీల్లేదు. కేవలం వెజిటేరియన్ మాత్రమే అనుమతిస్తారు, అయితే కోడిగుడ్లు (Eggs) మాత్రం తెచ్చుకోవచ్చు. అంతేకాదు, ఇంటర్వెల్ లేదా లంచ్ టైమ్‌లో ఏ విద్యార్థి కూడా స్కూల్ గేటు దాటి బయటకు వెళ్లకుండా కఠిన లాక్‌డౌన్ విధించారు.
తేలనున్న ఆ ఐదుగురి భవిష్యత్తు!
అస్సాంలో డిసెంబర్ 4, 2024 నుంచే పబ్లిక్ ప్రదేశాలలో బీఫ్ తినడంపై ప్రభుత్వం పూర్తి నిషేధం విధించింది. చట్టాన్ని ఉల్లంఘించి స్కూల్లో ఇలాంటి పని చేసిన ఆ ఐదుగురు మైనర్ విద్యార్థులను అదే స్కూల్లో ఉంచాలా? లేక డిస్మిస్ చేయాలా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది.














Click it and Unblock the Notifications