క్లాస్ రూమ్‌ లోనే.. విద్యార్థినితో అసభ్య భంగిమలో: ఫోటోలు వైరల్!(వీడియో)

Subscribe to Oneindia Telugu

భోపాల్: క్లాస్ రూమ్‌లో ప్రేమ పాఠాలు ఒలకబోయడం.. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించి దేహశుద్ది చేయించుకోవడం.. ఇటీవలి కాలంలో చాలామంది మాస్టార్లు వెలగబెట్టిన తంతు. అసోం రాష్ట్రంలోను మరో కీచక టీచర్ ఇలాగే ప్రవర్తించి జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. అసోం రాష్ట్రంలోని హైలాకంది జిల్లా కట్లిచెర్రా పట్టణానికి చెందిన ఫైజుద్దీన్ లస్కర్ అనే ఉపాధ్యాయుడు తరగతి గదిలోని ఓ బాలికతో అసభ్యంగా ఫోటోలు దిగాడు. అసభ్య భంగిమలో ఆమెను కౌగిలించుకుని ఫోటోలు తీయించుకున్నాడు.

అంతేకాదు.. ఆ బాలికను అతను పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడట. కానీ ఇంతలోనే బాలిక తల్లిదండ్రులు వేరే యువకుడితో ఆమెకు వివాహం నిశ్చయం చేయడంతో.. తరగది గదిలో దిగిన ఫోటోలన్నింటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. విషయం పోలీసుల దాకా వెళ్లడంతో జిల్లా ఎస్పీ గోస్వామి అతనిపై చర్యలకు ఆదేశించారు. దీంతో పీసీ సెక్షన్ 192, సెక్షన్ 67, ఐటీ యాక్టు సెక్షన్ 8, పోస్కో చట్టాల కింద కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A teacher of a private high school in Hailakandi district in southern Assam was arrested by police under Section 8 of POCSO and a few other Acts following a photograph
Please Wait while comments are loading...