వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిటైర్డ్ టీచర్‌పై కేంద్ర మంత్రి రాజన్ గోహెన్ వివాదాస్పద వ్యాఖ్యలు

By Narsimha
|
Google Oneindia TeluguNews

డిస్‌పూర్: కేంద్ర మంత్రి రాజన్ గోహెన్ పబ్లిక్ మీటింగ్‌లో ఓ రిటైర్డ్ టీచర్ పట్ల వ్యవహరించిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తమ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను ఏకరువు పెట్టిన రిటైర్డ్ టీచర్ పట్ల కేంద్ర మంత్రి వ్యవహరించిన తీరుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అసోం రాష్ట్రంలోని నాగోన్ పట్టణంలో మంగళవారం నాడు స్వచ్ఛ భారత్ అభియాన్ తరపున కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రాజన్ గోహెన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఓ రిటైర్డ్ టీచర్ మైక్ అందుకొని అమెలాపట్టి ప్రాంతంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు.

ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకొని తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన కేంద్ర మంత్రి రాజన్ గోహెన్ కుర్చీలో నుండి లేచి వచ్చాడు. రిటైర్డ్ టీచర్ చేతిలోని మైక్‌కు లాక్కొన్నాడు. అంతేకాదు నాన్సెస్ ఏం మాట్లాడుతున్నావంటూ రెచ్చిపోయాడు. ఈ కార్యక్రమాన్ని చెడగొట్టేందుకు వచ్చావా అంటూ ప్రశ్నించారు.

Assam: Union minister rebukes retired teacher for complaining about bad roads, faces protests

ఈ విషయంపై సంబంధిత అధికారితో మాట్లాడాలేగానీ, ఇక్కడ మాట్లాడటం ఏంటి?అంటూ ప్రశ్నించారు. దానికి ప్రతిగా ఆ రిటైర్డ్‌ టీచర్‌'నేను నాగోన్‌లో నివసించే ఓ వ్యక్తిగా మాట్లాడుతున్నా. కావాలంటే నాతో రా... సమస్యలు ఎలా ఉన్నాయో చూపిస్తా. నేనేం అబద్ధాలు చెప్పటం లేదు' అని ఆయన మంత్రికి అదే స్థాయిలో బదులిచ్చారు.

దీంతో మంత్రి తీవ్రంగా స్పందించారు. ఏదైనా సమస్య ఉంటే తనను వ్యక్తిగతంగా కలవాలని కోరారు. అంతేగానీ ఇలా పబ్లిక్‌ మీటింగ్‌లో లేవనెత్తటం ఏంటి? బుద్ధుందా నీకు. ఇలా మాట్లాడినంత మాత్రాన సమస్యలు పరిష్కారం అవుతాయనుకుంటున్నావా? మూసుకుని కూర్చో అంటూ అంటూ గోహేన్‌ ఆ వృద్ధుడిపై విరుచుకుపడ్డారు.

ఈ కార్యక్రమం పూర్తైన తర్వాత మీడియా ఈ విషయమై మంత్రి గోహెన్‌ను ప్రశ్నించింది. ఆ వ్యక్తికి తానెందుకు క్షమాపణలు చెప్పాలని మంత్రి మీడియాను ప్రశ్నించారు. కేంద్ర మంత్రి వైఖరిని నిరసిస్తూ నాగోన్‌లోని మంత్రి ఇంటి ఎదుట కొందరు విద్యార్ధులు ఆందోళనలకు దిగారు. రిటైర్డ్ టీచర్‌కు క్షమాపణలు చెప్పాలని కోరారు.

English summary
Students and teachers in Assam’s Nagaon town protested on Tuesday against Union minister Rajen Gohain after he rebuked a retired teacher at a public meeting when he was raising concerns about bad roads in his locality. Gohain, the minister of state for railways, is a four-time Lok Sabha MP from Nagaon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X